AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pokiri Movie: పోకిరి సినిమాను ఆ హీరో కోసం రాసుకున్న పూరి జగన్నాథ్.. చివరకు మహేష్‏తో ఎందుకు చేశారంటే..

సినిమా రిలీజై నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పోకిరి సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో మహేష్ సరసన ఇలియానా నటించింది. అలాగే షాయాజీ షిండే, ఆశీష్ విధ్యార్థి, బ్రహ్మానందం, అలీ, నాజర్, అజయ్ కీలకపాత్రలలో నటించారు. అయితే నిజానికి ఈ సినిమా కథను పూరి మహేష్ బాబు కోసం రాసుకోలేదంట.

Pokiri Movie: పోకిరి సినిమాను ఆ హీరో కోసం రాసుకున్న పూరి జగన్నాథ్.. చివరకు మహేష్‏తో ఎందుకు చేశారంటే..
Pokiri Movie
Rajitha Chanti
|

Updated on: Apr 28, 2024 | 2:59 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‏ను మలుపు తిప్పిన సినిమా పోకిరి. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. 28 ఏప్రిల్ 2006న ఈ మూవీ గ్రాండ్‏గా రిలీజ్ అయ్యి వసూళ్ల పరంగా రికార్డ్స్ సృష్టించింది. రూ. 10 కోట్ల బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమా రూ. 70 కోట్ల గ్రాస్.. రూ. 40 కోట్ల షేర్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజై నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పోకిరి సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో మహేష్ సరసన ఇలియానా నటించింది. అలాగే షాయాజీ షిండే, ఆశీష్ విధ్యార్థి, బ్రహ్మానందం, అలీ, నాజర్, అజయ్ కీలకపాత్రలలో నటించారు. అయితే నిజానికి ఈ సినిమా కథను పూరి మహేష్ బాబు కోసం రాసుకోలేదంట. పోకిరి సినిమా 2006లో రిలీజ్ కాగా.. ఆ కథను రాసుకుంది మాత్రం అంతకు ఆరేళ్ల ముందుగానే.

పూరి తన తొలి చిత్రం బద్రి కన్నా ముందే ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారట. ఇక ఈ మూవీ కోసం హీరోలుగా పవన్ కళ్యాణ్, రవితేజలను అనుకున్నారట. అలాగే ఈ చిత్రానికి ఉత్తమ్ సింగ్, సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్స్ ఫిక్స్ చేసుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా కార్యరూపం దాల్చలేదని..ఆ తర్వాత మహేష్ కోసం ఈ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి పోకిరి పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేశారట పూరి. అలాగే ఈ సినిమాకు మహేష్ సరసన అనుకున్న హీరోయిన్ ఇలియానా కూడా కాదు..ఆ స్థానంలో సూపర్ హిరోయిన్ అయేషా టకియాను సెలక్ట్ చేసుకున్నారని.. కానీ ఆమె ఆ పాత్రను వదులకోవడంతో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సెలక్ట్ అయ్యింది.

కానీ అదే సమయంలో బాలీవుడ్ సినిమా గ్యాంగ్ స్టర్ మూవీకి కూడా అడిషన్స్ జరగడంతో.. ఈ రెండు చిత్రాల్లో సెలక్ట్ అయ్యింది. అయితే కేవలం ఒక సినిమా మాత్రమే చేయాలని కండీషన్ ఉండడంతో కంగనా పోకిరి చిత్రాన్ని వదులుకుంది. ఇక ఆ తర్వాత దేవదాసు బ్యూటీ ఇలియానకు ఈ అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత మహేష్, పూరి కాంబోలో వచ్చిన బిజినెస్ మెన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే