Tollywood: ఒక్క సినిమాకు రూ.10 కోట్లు.. ఇండస్ట్రీలో తోపు మ్యూజిక్ డైరెక్టర్.. కానీ హీరోయిన్లతో ఎఫైర్స్ రూమర్స్..
ఇండస్ట్రీలోనే తోపు మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటివరకు అతడు అందించిన సాంగ్స్ యూట్యూ్బ్ లో మిలియన్ వ్యూస్ అందుకున్నాయి. కంటెంట్.. హీరో ఎలివేషన్ కు తగ్గట్టుగా మ్యూజిక్ క్రియేట్ చేయడం.. అద్భుతమైన బీజీఎం అందించడంలో అతడు దిట్ట. కానీ హీరోయిన్లతో ప్రేమ అంటూ నిత్యం వార్తలలో నిలుస్తుంటాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

దక్షిణాది చిత్రపరిశ్రమలో అతడు తోపు మ్యూజిక్ డైరెక్టర్. ఇండస్ట్రీలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాలకు బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ అందించారు. అతడు అందించిన పాటలు, బీజీఎం యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ అతడు. ఈమధ్య కాలంలో అతడి పేరు నెట్టింట తెగ మారుమోగుతుంది. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? జైలర్, పెట్ట, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తమిళ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. ఇటీవల SRH సీఈవో కావ్య మారన్ తో పెళ్లంటూ వార్తలలో ఆయన పేరు తెగ చక్కర్లు కొడుతుంది.
అనిరుధ్ రవిచంద్రన్.. మ్యూజిక్ పరంగానే కాదు.. ఎక్కువగా ప్రేమకథలతో వార్తలలో నిలుస్తుంటారు. నివేదికల ప్రకారం..2023లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా కోసం రూ.10 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. రెహమాన్ రెమ్యునరేషన్ రూ.8 కోట్లు ఉండగా..ఇప్పుడు టాప్ స్థానంలో అనిరుధ్ నిలిచాడు. ఒక్కో సినిమాకు రూ.10 నుంచి 12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు అనిరుధ్. అలాగే నివేదికల ప్రకారం అతడి ఆస్తులు రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే అనిరుధ్ వయసు కేవలం 34 సంవత్సరాలు మాత్రమే.
గత నాలుగు రోజులుగా అనిరుధ్ పేరు నెట్టింట మారుమోగుతుంది. కళానిధి మారన్ కూతురు కావ్య మారన్ తో అనిరుధ్ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది. అయితే తాజాగా ఈ రూమర్స్ పై స్పందించిన అనిరుధ్.. తన గురించి రూమర్స్ ప్రచారం చేయడం ఆపాలంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ వార్తలపై కావ్య మారన్ ఇంకా స్పందించలేదు. గతంలో అనిరుధ్ పేరు కీర్తి సురేష్, ఆండ్రియాతో ముడిపడి ఉంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..