AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? చూస్తే అవాక్ అవుతారు

వెంకటేష్ హీరోగా నటించిన సుందరకాండ సినిమా గుర్తుందా.? కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1992లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది మీనా. 

సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? చూస్తే అవాక్ అవుతారు
Sundarakanda
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2024 | 8:20 PM

Share

చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించలేక కనుమరుగయ్యారు. ఒకటి రెండు సినిమాల్లో మెప్పించిన హీరోయిన్స్ ఆతర్వాత కనిపించకుండా పోయారు. అంతే కాదు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ కూడా కనిపించకుండా మాయమయ్యారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? వెంకటేష్ హీరోగా నటించిన సుందరకాండ సినిమా గుర్తుందా.? కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1992లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది మీనా.

మీనా వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ కూడా నటించింది ఆమె పేరే అపర్ణ.  సుందరకాండ సినిమాలో వెంకటేష్ టీచర్ గా నటించగా.. స్టూడెంట్ గా నటించింది అపర్ణ. సుందరకాండ సినిమాలో అల్లరి అమ్మాయిగా  కనిపించి మెప్పించింది అపర్ణ. అయితే ఈ సినిమాలో ముందుగా స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారట.

ఆ తర్వాత కథ ప్రకారం కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని అపర్ణను ఎంపిక చేశారట. కె వి వి సత్యనారాయణ ఇంటికి రాఘవేంద్రరావు వెళ్లగా అక్కడ ఓ అమ్మాయి నచ్చిందట. ఆ అమ్మాయి అయితే తన సినిమాకు సరిగ్గా సెట్ అవుతుందని భావించారట రాఘవేంద్ర రావు. కానీ ఆ అమ్మాయిని అడగలేకపోయారట. అయితే ఆ తర్వాత పదిరోజులకు ఆ అమ్మాయి ఆడిషన్స్‌కు వచ్చిందట. దాంతో వెంటనే ఆమెను ఎంపిక చేశారట. అయితే సుందరకాండ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత హీరోయిన్ గా అవకాశాలు క్యూ కట్టాయట.. కానీ సినిమాలు వద్దు అని పేరెంట్స్ చెప్పడంతో.. సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Aparna

అపర్ణ లేటెస్ట్ ఫోటో..

Aparna 1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..