AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా.. కీర్తి అందాలకు ఫిదా అవ్వాల్సిందే..!

తన నటనతో ఆడియన్స్ ను ఆకర్షించిన ఈ చిన్నది తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది. ఈ చిన్నది ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ ఆమె హఠాత్తుగా గ్లామర్ అవతార్ లో దర్శనమించి షాక్ ఇచ్చింది. ఈ మధ్య కీర్తిసురేష్ గ్లామర్ రోల్స్ చేస్తూ అలరిస్తుంది.

Keerthy Suresh: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా.. కీర్తి అందాలకు ఫిదా అవ్వాల్సిందే..!
Keerthy Suresh
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2024 | 7:25 PM

Share

తెలుగు మంచి క్రేజ్ ఉన్న బ్యూటీస్ లో కీర్తి సురేష్. ఆ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎక్కువగా గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ.. సినిమాలను ఎంచుకుంటుంది. తన నటనతో ఆడియన్స్ ను ఆకర్షించిన ఈ చిన్నది తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది. ఈ చిన్నది ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ ఆమె హఠాత్తుగా గ్లామర్ అవతార్ లో దర్శనమించి షాక్ ఇచ్చింది. ఈ మధ్య కీర్తిసురేష్ గ్లామర్ రోల్స్ చేస్తూ అలరిస్తుంది. మొన్నీమధ్య మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో గ్లామరస్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కీర్తిసురేష్ ను గ్లామర్ రోల్ లో చూసి అభిమానులు షాక్ అయ్యారు. అంతే కాదు సోషల్ మీడియాలోనూ కీర్తిసురేష్ ఈ మధ్య గ్లామరస్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే బాలీవుడ్ లోకి అడుగు పెట్టగానే తన అందాలతో అలరిస్తుంది. ఇందుకు సంబందించిన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్‌కి జోడీగా కీర్తి సురేష్ ‘బేబీ జాన్’ అనే సినిమాలో నటిస్తోంది . ఈ సినిమా షూటింగ్ సెట్‌లోని కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి.

వరుణ్ ధావన్ పుట్టినరోజును ఇటీవల ‘బేబీ జాన్’ సెట్స్‌లో జరుపుకున్నారు. అదే రోజు పాట షూటింగ్ కూడా జరిగిందని తెలుస్తోంది. ఇందులో కీర్తి సురేష్, వరుణ్ ధావన్ పాల్గొన్నారు. షూటింగ్ విరామంలో వరుణ్ ధావన్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ టైం లో తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కీర్తిసురేష్ గ్లామర్  లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘మహానటి’ చిత్రంలో అలనాటి నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాలోని పాటలో కాస్త గ్లామర్ గా కనిపించింది. ఇప్పుడు బాలీవుడ్ లో ఫుల్ గ్లామర్ గెటప్ లో అభిమానులకు కిక్ ఇచ్చింది. ‘బేబీ జాన్’ తమిళ చిత్రం ‘తేరి’కి హిందీ రీమేక్. ఒరిజినల్ సినిమాలో దళపతి విజయ్ పోషించిన పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తున్నాడు. ‘తేరి’ సినిమాలో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించింది. హిందీలో కీర్తి సురేష్ ఆ పాత్రను చేస్తోంది. అట్లీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by Desi Divas (@onlydesidiva)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నాన్ వెజ్ తినేవారికి షాక్.. పెరిగిన చికెన్ ధరలు.. ఎంతో తెలుసా..?
నాన్ వెజ్ తినేవారికి షాక్.. పెరిగిన చికెన్ ధరలు.. ఎంతో తెలుసా..?
దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ, పివీ సింధు..
దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ, పివీ సింధు..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు