- Telugu News Entertainment Tollywood Do you know how this child actor who starred in the movie C/o Kancharapalem is doing now?
ఇదెక్కడి మార్పు రా బాబు..! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. హీరోయిన్ లుక్‌లోకి..
కంచరపాలెం సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు గుర్తున్నారా..? చక్కటి నటనతో ఆకట్టుకున్నారు అందరూ. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.క్యూట్ నటనతో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది
Updated on: Nov 12, 2025 | 2:04 PM

కంచరపాలెం సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు గుర్తున్నారా..? చక్కటి నటనతో ఆకట్టుకున్నారు అందరూ. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

క్యూట్ నటనతో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది ఆ చిన్నది. పై ఫోటోలకనిపిస్తున్న చిన్నారి పేరు నిత్యా శ్రీ.. కంచెరపాలెం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నిత్యా. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది నిత్యా.

మొన్నమధ్య ధనుష్ నటించిన సార్ సినిమాలో కనిపించింది. ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఈ అమ్మడు చాలా అందంగా మారింది.హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది నిత్యా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.

రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటిస్తుంది ఈ చిన్నారి. అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ అమ్మడు హీరోయిన్ గా ఓ సినిమా మొదలైంది.

అలాగే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.




