ఏంటీ..! ఈవిడ నాని హీరోయినా..!! సినిమాలు మానేసి ఇప్పుడు ఏం చేస్తుందంటే
వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 సినిమాకోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. హిట్ సినిమాల సిరీస్ లో ఇప్పటివరకు విడుదలైన రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. నాని సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. సినిమా కథ ఎలా ఉన్నప్పటికీ నాని తన నటనతో ఆకట్టుకుంటాడు. నాని కెరీర్ లో చాలా సూపర్ హిట్స్ అందుకున్నాడు. అలాగే నాని నటించిన సినిమాల్లో ప్రేక్షకుల మనసుకు హత్తుకున్నా సినిమా భీమిలి కబడ్డీ జట్టు. ఈ మూవీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. థియేటర్స్ లో ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా.. నాని నటన ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో అమాయకపు యువకుడిగా నటించి అలరించాడు మన నేచురల్ స్టార్. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా చూస్తారు. తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా 2010లో విడుదలైంది.
ఇదికూడా చదవండి : ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? నేను నీ పద్దుని.. ఎంత మారిపోయింది ఈ చిన్నది..
కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ చిత్రమైన వెన్నిళ కబడి కుళుకు రీమేక్. అక్కడ ఈ సినిమా హిట్ అయ్యింది కానీ ఇక్కడ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో నానికి జోడిగా శరణ్య మోహన్ నటించింది. ఈ జంట ఎంతో చూడముచ్చగా అనిపించింది. శరణ్య మోహన్ తన క్యూట్ లుక్స్ తో ‘ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ఈ చిన్నది పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది.
ఇదికూడా చదవండి :143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..
అయితే శరణ్య చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందం అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మూడు నాలుగు సినిమాలే చేసింది. కానీ శరణ్య మోహన్ తమిళ్, మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. అలాగే కన్నడ, హిందీ సినిమాలోనూకనిపించింది మెప్పించింది ఈ చిన్నది. తెలుగులో నటుడు కృష్ణుడు హీరోగా చేసిన విలేజ్‌లో వినాయకుడు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది శరణ్య. ఆతర్వాత భీమిలి కబడ్డీ, హ్యాపీ హ్యాపీగా, కళ్యాణ్ రామ్ కత్తి సినిమాల్లో నటించింది. కళ్యాణ్ రామ్ కత్తి సినిమాలో ఆయన చెల్లెలిగా నటించి మెప్పించింది. ఇక శరణ్య ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. తన చిన్ననాటి స్నేహితుడు, వైద్యుడు అరవింద్ కృష్ణన్‌ను ఆమె 2015 లో వివాహం చేసుకుంది ఈ భామ. వీరికి ఇద్దరూ పిల్లలు ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ దర్శనమిస్తోంది ఈ బ్యూటీ.
ఇదికూడా చదవండి : 53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి








