Tollywood: యాంకర్ సుమ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? ఒక్కో షోకు ఎంత తీసుకుంటారంటే!
యాంకర్ సుమ.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ తన పసందైన మాటలతో ఆకట్టుకుంటోంది.

యాంకర్ సుమ.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ తన పసందైన మాటలతో ఆకట్టుకుంటోంది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. సుమ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తనదైన పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో ఇప్పటికీ బుల్లితెరపై టాప్ యాంకర్‌గా కొనసాగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లలో సైతం సుమకు ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఒక్క యాంకర్‌గా మాత్రమే కాదు.. స్టార్ హీరోల మూవీ ఫంక్షన్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇలా రోజురోజుకూ తన క్రేజ్‌ను పెంచుకుంటూపోతున్న సుమ రెమ్యూనరేషన్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
యాంకర్ సుమ ఒక్కో ఈవెంట్‌కు రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకుంటారని సమాచారం. అలాగే ఆమె చేసే ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 2 నుంచి రూ. 3 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ఇలా మొత్తంగా నెలకు యాంకర్ సుమ సంపాదన రూ. 20 లక్షలపై మాటేనని టాక్ వినిపిస్తోంది. కాగా, ఇప్పుడున్న యాంకర్లలో సుమ రెమ్యూనరేషనే ఎక్కువ ఉండటం గమనార్హం.
