Siddharth: ‘భారతీయుడు 2’ పదింతలు పెద్దదే.. విజువల్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా.. సిద్ధార్థ్ కామెంట్స్..
దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. ఇందులో కమల్ హాసన్ తోపాటు.. కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్, బాబీ సింహా, సముద్రఖని కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఫస్ట్ లుక్ మినహా ఇప్పటివరకు మరో అప్డేట్ రాలేదు.

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సినిమా భారతీయుడు. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అవినీతి ప్రపంచంపై సేనాపతి అనే బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తూ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ తెరకెక్కిస్తున్నారు శంకర్. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. ఇందులో కమల్ హాసన్ తోపాటు.. కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్, బాబీ సింహా, సముద్రఖని కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఫస్ట్ లుక్ మినహా ఇప్పటివరకు మరో అప్డేట్ రాలేదు. కానీ చాలా కాలం తర్వాత మరోసారి కమల్, శంకర్ కాంబో రాబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాతోపాటు.. సిద్ధార్థ్ టక్కర్ మూవీలోనూ నటించారు. కావ్య థాపర్ కథానాయికగా నటించిన ఈ సినిమా జూన్ 9న అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సిద్ధార్థ్.. ఇండియన్ 2 సినిమాపై ఆసక్తికర అప్డేట్స్ రివీల్ చేశారు. ఈ సినిమా భారతీయుడు కంటే పదింతలు పెద్దదిగా ఉంటుందని అన్నారు. పదింతలు పెద్దది అంటే ఎలా ఉంటుందో విజువల్ మీ ఊహకే వదిలేస్తున్నానని అన్నారు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు.




సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ శంకర్ సార్ నన్ను హీరోగా ఈ సినిమా ప్రపంచానికి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను లాంచ్ చేసిన అదే గొప్ప దర్శకుడు నన్ను నమ్మి మరో ప్రాజెక్ట్ కోసం పిలిచారు. నా ప్రతిభను ఆయన నమ్మారు. ఆయన నుంచి కాల్ రాగానే నేను స్పష్టంగా మాట్లాడకుండా ఉండిపోయాను. అది కూడా ఈరోజు దేశంలోని అతి పెద్ద సినిమాల్లో ఒకటైనందుకు. ఈ సినిమా గురించి మాట్లాడటం స్టార్ చేస్తే దాదాపు రెండు నెలలపాటు మాట్లాడవచ్చు. శంకర్ సార్ ఎలాంటి లీక్స్ వద్దన్నారు. కమల్ హాసన్ సర్ తో పనిచేయాలనేది నా కల. శంకర్ సర్, కమల్ సర్ మూవీలో పనిచేయడం నా అదృష్టం. ” అని అన్నారు.