AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కట్టప్ప కూతురా మజాకా.. స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు మావ..! ఇప్పుడు ఏం చేస్తుందంటే

దక్షిణాదిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సత్యరాజ్. హీరోగా అనేక చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు సహయ నటుడిగా రాణిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషలలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు సత్యరాజ్. పగలే వెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన.. తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం హీరోలకు తండ్రిగా కనిపిస్తున్నారు.

కట్టప్ప కూతురా మజాకా.. స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు మావ..! ఇప్పుడు ఏం చేస్తుందంటే
Sathyaraj
Rajeev Rayala
|

Updated on: Sep 26, 2025 | 6:40 AM

Share

నటుడు సత్యరాజ్‌ సౌత్ ఇండియాలో సూపర్ పాపులర్. ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో ఆయన దుమ్మురేపారు. వయస్సు పైబడటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయ్యారు. తెలుగులో ఆయన్ను ఒరిజినల్ పేరుతో.. కంటే కట్టప్ప అని పిలిస్తేనే గుర్తుపడతారు. బాహుబలి సినిమాలో కట్టప్పగా ఆయన విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయనకు చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కుతూ వస్తున్నాయి. ముఖ్యంగా హీరోలకు తండ్రి పాత్రల్లో ఆయన చక్కగా ఒదిగిపోతారు. ఇంత ఇమేజ్ ఉన్న నటుడు అయిన సత్యరాజ్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. సినిమాల్లో తప్పితే.. మీడియా, సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్‌గా కనిపించరు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలామందికి తెలీదు. సత్యరాజ్‌ ఫ్యామిలీ విషయానికి వస్తే.. భార్య మహేశ్వరి, ఒక తనయుడు, కుమార్తె ఉన్నారు.

ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా సీన్స్ మొత్తం కట్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మమతా మోహన్ దాస్

ఇప్పటికే సత్యరాజ్ కొడుకు సిబిరాజ్‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. డోరా, మాయోన్‌ వంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభ చాటుకున్నాడు. ఇక ఆయన కుమార్తె పేరు దివ్య సత్యరాజ్‌. ప్రస్తుతం ఆమె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇండస్ట్రీకి దూరంగా ఉండే దివ్య.. న్యూట్రిషనిస్ట్‌గా పని చేస్తోంది. అంత స్టార్ యాక్టర్ కూతురు అయినప్పటికీ.. ఆమె మీడియాలో పెద్దగా కనిపించదు.  సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆరోగ్యం, జీవనశైలిపై నెటిజన్లకు సలహాలు, సూచనలు ఇస్తుంది. దీంతో ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య బాగా ఉంది.

ఇవి కూడా చదవండి

బెస్ట్ ఫ్రెండ్ భర్తనే వలలో వేసుకున్న స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే అతనితో..

ఇక దివ్య ఫోటోలు లేటెస్ట్‌గా చూసిన నెటిజన్స్.. ఆమెది హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని అందం అంటూ ప్రశంసిస్తున్నారు. కాగా దివ్య మహిళ్‌మతి ఇయక్కం పేరుతో  స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తమిళనాడులోని అధికార పార్టీలో చేరారు దివ్య సత్యరాజ్. చెన్నైలోని పార్టీ కార్యాలయం అన్నా అరివలయంలో పార్టీలో చేరారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా బయోగ్రఫీలో స్టేట్ డిప్యూటీ సెక్రటరీ అనే మార్చుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న దివ్య.. ఇటు నెటిజన్స్, అభిమానులకు అవసరమైన హెల్త్ సలహాలు సైతం ఇస్తున్నారు.

చేసింది రెండు సినిమాలు.. రెండూ యావరేజ్..! అయినా తగ్గని క్రేజ్.. చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us