Kattappa Role: కట్టప్ప పాత్రను మిస్ చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా ?.. ఎందుకు వదలుకున్నాడంటే..

బాహుబలి సినిమాను మలుపు తిప్పేది.. రెండో భాగం కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన పాత్ర కట్టప్ప. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? అనే ప్రశ్న అప్పట్లో మారుమోగింది. ఈ సినిమాలో కట్టప్ప పాత్రలో ఒదిగిపోయారు తమిళ్ నటుడు సత్యరాజ్. కట్టప్ప అంటే ఎప్పటికీ గుర్తిండిపోయేలా నటించి మెప్పించారు. అయితే ఈ పాత్ర కోసం సత్యరాజ్ ఫస్ట్ ఛాయిస్ కాదట.

Kattappa Role: కట్టప్ప పాత్రను మిస్ చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా ?.. ఎందుకు వదలుకున్నాడంటే..
Kattappa
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 23, 2023 | 9:51 AM

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా బాహుబలి. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తెలుగు సినీ ఖ్యాతిని దేశ నలుమూలకు విస్తరింపజేసింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా తిరుగులేని రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ మూవీలోని బాహబలి, భల్లాల దేవుడు, శివగామి, దేవసేన, కట్టప్ప పాత్రలకు వచ్చిన గుర్తింపు చెప్పక్కర్లేదు.ఈ సినిమాను మలుపు తిప్పేది.. రెండో భాగం కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన పాత్ర కట్టప్ప. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? అనే ప్రశ్న అప్పట్లో మారుమోగింది. ఈ సినిమాలో కట్టప్ప పాత్రలో ఒదిగిపోయారు తమిళ్ నటుడు సత్యరాజ్. కట్టప్ప అంటే ఎప్పటికీ గుర్తిండిపోయేలా నటించి మెప్పించారు. అయితే ఈ పాత్ర కోసం సత్యరాజ్ ఫస్ట్ ఛాయిస్ కాదట.

ఈ పాత్రకు ముందుగా అనుకున్నది బాలీవుడ్ స్టార్ సత్యరాజ్. కట్టప్ప రోల్ కోసం రాజమౌళి ముందుగా సంజయ్ దత్ ను సంప్రదించారట. అయితే స్క్రిప్ట్ విన్న సంజయ్ దత్.. కట్టప్ప పాత్ర అంత బలంగా లేదని భావించి అవకాశాన్ని వదులుకున్నారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంజయ్ దత్ వెల్లడించారు. ఆయన వదులుకోవడంతో ఈ పాత్ర సత్యరాజ్ వద్దకు వెళ్లింది. ఆయన కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. వాస్తవానికి కట్టప్ప పాత్రను సంజయ్ దత్ పోషించి ఉంటే ఎలా ఉండేదో కానీ.. ఆ పాత్రకు సత్యరాజ్ తప్ప మరో నటుడిని ఊహించుకోలేని విధంగా సత్యరాజ్ నటించారు.

ఇవి కూడా చదవండి
Sanjay Dutt

Sanjay Dutt

సంజయ్ దత్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దాల కెరీర్ లో హీరోగా అలరించిన ఆయన.. కేజీఎఫ్ చాప్టర్ 2లో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించారు. ఇందులో అధీరా పాత్రలో ఆయన నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఆయన.. డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న తారక్ 30 ప్రాజెక్టులో నటిస్తున్నారు.