Tollywood: కోట్ల ఆస్తిని, సినిమాలు వదిలేసి కూలీ పని చేసుకుంటున్న స్టార్ హీరో.. ఎందుకంటే..
దక్షిణాదిలో అతడు టాప్ హీరో. దశాబ్దాలుగా సినీరంగంలోకి అనేక సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశాడు. అద్భుతమైన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. అంతేకాదు.. బాక్సాఫీస్ వద్ద తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ అతడు తనయుడు మాత్రం సినిమాలు వదిలేసి రోజూ కూలీ పనికి వెళ్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరు.. ? ఎందుకు అలాంటి పని చేస్తున్నాడో తెలుసా.. ?

మలయాళీ సినీరంగంలో ఒక్క సినిమాతోనే సంచలనం సృష్టించాడు. అందమైన ప్రేమకథతో యువత మనసులు గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారతాడు అనుకుంటే.. సినిమాలు వదిలేసి రోజూ కూలీ పనికి వెళ్తున్నాడు ఓ యంగ్ హీరో. వరుస హిట్స్ అందుకుంటూ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే విదేశాలకు వెళ్లి గొర్రెలు కాస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. తనే ప్రణవ్ మోహన్ లాల్. మలయాళీ చిత్రపరిశ్రమలో యంగ్ హీరోలలో ఆయన ఒకరు. సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు. కోట్ల ఆస్తిని, సినిమాలు వదిలేసి కూలీ పనికి వెళ్తున్నాడు. ఇండస్ట్రీలో హీరోగా, దర్శకుడిగా, రచయితగా తనదైన ముద్ర వేశాడు ప్రణవ్ మోహన్ లాల్. తండ్రి బాటలోనే ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించాడు. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. సామాన్యుడిగా జీవితం గడుపుతూ సోషల్ మీడియాలో సైతం అంతగా యాక్టివ్ గా లేరు.
అసలు విషయానికి వస్తే.. ప్రణవ్ మోహన్ లాల్… బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత స్క్రీన్ ప్లే రైటర్ గా.. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి చివరకు హీరోగా సక్సెస్ అయ్యారు. హృదయం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు మలయాళంతోపాటు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. మలయాళంలో వర్షంగళ్కు శేషం సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..
ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రణవ్.. ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే ఆసక్తి ఉన్న ప్రణవ్.. ఇప్పుడు వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. హీరోగా నటించడం ప్రారంభించిన 7 ఏళ్లల్లో దాదాపు 5 చిత్రాల్లో నటించాడు. ప్రతి సినిమా కంప్లీట్ కాగానే అనుభవం కోసం ఏదోక ఊరికి వెళ్తుంటాడు. ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్న ప్రణవ్.. అక్కడ ఓ ఫామ్ హౌస్ లో ఉంటూ గొర్రెలు, గుర్రాల కాపరిగా పనిచేస్తున్నాడ. భోజనం, షెల్టర్ ఇస్తారని జీతం మాత్రం ఉండదని గతంలో ఆయన తల్లి, మోహన్ లాల్ సతీమణి తెలిపారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..




