నేను బయట నెలకే కోటి రూపాయలు సంపాదిస్తా.. బిగ్ బాస్ రెమ్యునరేషన్ పై మాధురి
దువ్వాడ మాధురి. మొన్నటివరకు వార్తల్లో నిలిచినా ఈ పేరు.. ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని సోషల్ మీడియాలోనూ తెగ వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లోకి దువ్వాడ మాధురి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి.. హౌస్ లో రాక్ రచ్చ చేశారు. చిన్నదానికి పెద్ద దానికి గొడవలు పెట్టుకుంటూ మాధురి హౌస్ లో మాములు రచ్చ చేయలేదు.

దివ్వెల మాధురి. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఆమె పేరు వార్తల్లో తెగ వినిపించింది. అలాగే ఆమె పై ఎన్నో రకాల ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆతర్వాత ఆమె ట్రోల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు మాధురి. దాంతో ఆ క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మాధురి.. మొదటి రెండు వారాలు ఆమె నామినేషన్స్ లో లేదు. హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆమె గొడవలు, విధానాలతోనే ఎక్కువగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. మూడో వారం ఆమె నామినేషన్స్ లోకి వచ్చింది. ఆ వారమే ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
బాలయ్యకు లవర్‌గా, తల్లిగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
బయటకు వచ్చిన తర్వాత ఆమె పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ.. ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. తాను కావాలనే హౌస్ నుంచి బయటకు వచేశానని చెప్పి షాక్ ఇచ్చింది. నేను వెళ్ళాలి అనుకున్నా కాబట్టే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాను.. అలాగే నేను బయటకు రావాలనుకున్న కాబట్టే బయటకు వచ్చాను అని చెప్పింది మాధురి. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలో వచ్చిన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మాధురి.
7/జీ బృందావన్ కాలనీ సీక్వెల్‌లో హీరోయిన్ ఈమేనా..! అందం అదిరిపోయిందిగా..
ఓ యాంకర్ మధురిని ఇంటర్వ్యూ చేస్తూ.. కొంతమంది బిగ్‌బాస్‌కి ఫేమ్ కోసం వెళ్తారు.. మరికొంతమంది రెమ్యూనరేషన్ కోసం టెంప్ట్ అయి వెళ్తారు.. మరి మీరెందుకు వెళ్లారు అని అడగ్గా.. “నేను టెంప్ట్ అవ్వడానికి ఏం లేదు నాకు రోజుకి ఇక్కడే 2-3 లక్షలు వస్తాయి.. నేను టెంప్డ్ అవ్వాల్సిన అవసరం ఏముంది.. షో అంతా ఆడితే కోటి రూపాయలు వస్తాయి.. కానీ నాకు నెలకే కోటి రూపాయలు వస్తుంది.. అసలు నేను రెమ్యూనరేషన్‌కి ఏం డిమాండ్ చేయలేదు.. ఎప్పుడూ ఆశపడలేదు.. దేవుడిచ్చిన వరకూ మాకు డబ్బులు బానే ఉన్నాయి.. ఫేమ్ కూడా బానే ఉంది.. ఇది ఎక్స్‌పీరియన్స్ చేయాలి.. లైఫ్‌లో ఇది కూడా ఒక అవకాశం వచ్చిందని వెళ్లా అంతే అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. నెలకు కోటి రూపాయిలా అంటూఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పెళ్ళికి ముందే తల్లైంది.. కట్ చేస్తే విడాకులు.. ఇప్పుడు తనకన్నా 7ఏళ్ల చిన్నవాడితో..
View this post on Instagram




