Disha Patani: చౌరస్తాలో దిశా పటాని.. ప్రభాస్‌, సూర్య సినిమాలపై బోలెడు ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ

తెలుగులో ఆల్రెడీ ఒకటికి రెండు సినిమాలు చేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది కృతి సనన్‌కి. ఆదిపురుష్‌ రిలీజ్‌ అయ్యాక, టాప్‌ హీరోల ప్యాన్‌ ఇండియన్‌ మూవీస్‌ అన్నిటికీ ఆమె ఒన్‌ అండ్‌ ఒన్లీ ఆప్షన్‌ అవుతారనే టాక్‌ కూడా వినిపించింది.

Disha Patani: చౌరస్తాలో దిశా పటాని.. ప్రభాస్‌, సూర్య సినిమాలపై బోలెడు ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ
Disha Patani, Prabhas
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 25, 2023 | 5:39 PM

నార్త్ నుంచి ఓ హీరోయిన్‌ సౌత్‌కి ఎంట్రీ ఇస్తున్నారని అనగానే అందరి దృష్టీ ఒక చోటే ఆగుతోంది. ఈ హీరోయిన్‌కి హిట్‌ పడుతుందా? పడదా? సౌత్‌లో స్టార్స్ పక్కన చేసే చరిష్మా కంటిన్యూ అవుతుందా? లేదా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కొందరు బేఫికర్‌గా సమాధానం చెబుతుంటే, మరికొందరు మాత్రం బై బై అంటూ ముంబైకి రిటర్న్ టికెట్‌ కన్‌ఫర్మ్ చేసుకుంటున్నారు. లైగర్‌ గర్ల్ గా అనన్య పాండేని ఒక రేంజ్‌లో ఊహించుకున్నారు సౌత్‌ జనాలు. పొడుగు కాళ్ల సుందరి అనన్య పాండే, మన ఆరడుగుల అందగాళ్ల సినిమాల్లో అద్భుతమైన అవకాశాలు కొట్టేస్తారని అంతా ఫిక్సయిపోయారు. కానీ విజయ్‌ దేవరకొండతో నటించిన లైగర్‌ సినిమా ఫ్లాప్‌ కావడంతో ఆమె ఊసే లేదు. ఉత్తరాది భామ అనన్య పాండే కన్నా ముందే సాహోతో సౌత్‌ని పలకరించిన భామ శ్రద్ధా కపూర్‌. డార్లింగ్‌ ప్రభాస్‌ పక్కన మంచి మార్కులు కొట్టేసినప్పటికీ, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మాత్రం వెనకబడిపోయారు ఈ లేడీ. డార్లింగ్‌తో రీసెంట్‌గా నటించిన కృతిసనన్‌ సంగతైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగులో ఆల్రెడీ ఒకటికి రెండు సినిమాలు చేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది కృతి సనన్‌కి. ఆదిపురుష్‌ రిలీజ్‌ అయ్యాక, టాప్‌ హీరోల ప్యాన్‌ ఇండియన్‌ మూవీస్‌ అన్నిటికీ ఆమె ఒన్‌ అండ్‌ ఒన్లీ ఆప్షన్‌ అవుతారనే టాక్‌ కూడా వినిపించింది. ఆదిపురుష్‌ సినిమా ఫ్లాప్‌ కావడంతో అటు ఆమె వైపు చూస్తున్నవారే లేరిప్పుడు.

సక్సెస్‌లు ఫ్లాప్‌లతో నాకు సంబంధం లేదన్నది మొదటి నుంచీ కియారా ఇస్తున్న స్టేట్‌మెంట్‌. రామ్‌చరణ్‌ పక్కన ఆమె నటించిన వినయవిధేయరామా పెద్ద ఫ్లాప్‌. అయినా మళ్లీ రామ్‌చరణ్‌ సినిమా గేమ్‌ చేంజర్‌ వెతుక్కుంటూ వెళ్లింది కియారా దగ్గరకు. కియారా పక్కా ప్రొఫెషనల్‌ హీరోయిన్‌. గ్లామర్‌ విషయంలో ఆమెకు ఎలాంటి హద్దులు ఉండవు. నార్త్ లో రిలీజ్‌ అవుతున్న ఆమె సినిమాలన్నీ హిట్లే.. ఇలాంటి క్వాలిటీస్‌ ఆమెకు మంచి ఛాన్సులు తెచ్చిపెడుతున్నాయి. కియారా తర్వాత నార్త్ నుంచి వినిపిస్తున్న మరో నాయిక పేరు దిశా పటాని. ఓ వైపు ప్రభాస్‌ పక్కన ప్రాజెక్ట్ కెలో నటిస్తున్నారు దిశా పటాని. ఇటు సూర్య హీరోగా నటిస్తున్న కంగువలోనూ ఆమే కథా నాయిక. ఈ రెండు సినిమాలు రిలీజ్‌ అయితే, దిశా పటానికి ఉన్న క్రేజ్‌ అమాంతం పెరిగేదీ, తరిగేది అర్థమవుతుంది. అప్పటి వరకు ఆమె చౌరస్తాలో ఉన్నట్టే మరి!

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

రజనీకాంత్ నివాసాన్ని ముంచెత్తిన వరద నీరు.. వీడియో వైరల్
రజనీకాంత్ నివాసాన్ని ముంచెత్తిన వరద నీరు.. వీడియో వైరల్
ఓర్నీ.! ఇంత ఈజీనా.. ఈ ఫోటోలో '3' నెంబర్ కనిపెట్టగలరా..
ఓర్నీ.! ఇంత ఈజీనా.. ఈ ఫోటోలో '3' నెంబర్ కనిపెట్టగలరా..
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
ఇద్దరు దాటడానికి లేని ఓ చిన్న సందులో ట్రాఫిక్ సిగ్నల్.. వీడియో
ఇద్దరు దాటడానికి లేని ఓ చిన్న సందులో ట్రాఫిక్ సిగ్నల్.. వీడియో
15 ఏళ్ల ఇంగ్లండ్ కల నెరవేరేనా.. ఆసీస్‌తో యాషెస్ పోరుకు సిద్ధం
15 ఏళ్ల ఇంగ్లండ్ కల నెరవేరేనా.. ఆసీస్‌తో యాషెస్ పోరుకు సిద్ధం
నమ్మకం లేని మనిషితో ఉండలేనని చెప్పేసిన కావ్య.. బయటపడ్డ డ్రామా!
నమ్మకం లేని మనిషితో ఉండలేనని చెప్పేసిన కావ్య.. బయటపడ్డ డ్రామా!
వయనాడు బరిలో ప్రియాంక గాంధీ.. సీపీఐ, బీజేపీ నుంచి ఎవరు..?
వయనాడు బరిలో ప్రియాంక గాంధీ.. సీపీఐ, బీజేపీ నుంచి ఎవరు..?
ఇకపై మేడ్ ఇన్ ఇండియా అనాల్సిందే.. ముందుంది మరింత మంచికాలం..
ఇకపై మేడ్ ఇన్ ఇండియా అనాల్సిందే.. ముందుంది మరింత మంచికాలం..
మా కుక్క తప్పిపోయింది.. ఆచూకీ తెలిపిన వారికి బంపరాఫర్
మా కుక్క తప్పిపోయింది.. ఆచూకీ తెలిపిన వారికి బంపరాఫర్
ఎంత షుగర్‌ని అయినా కంట్రోల్ చేసే దొండకాయ.. మిస్ చేయండి..
ఎంత షుగర్‌ని అయినా కంట్రోల్ చేసే దొండకాయ.. మిస్ చేయండి..
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి
అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి