ఆ స్టార్ హీరో ఇంటికి పిలిచి మాట్లాడాడు.. ఓ కథ కూడా చెప్పా కానీ.. సినిమా పట్టాలెక్కలేదు: త్రినాద్ రావు నక్కిన
డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన తన దర్శకత్వంలో ఓ సినిమా సృష్టించిన సవాళ్లను అలాగే హీరోతో తన అనుబంధాన్ని వివరించారు. కథల ఎంపిక, హీరోలతో తన పనితీరును పంచుకున్నారు. కొత్త దర్శకుడు ఖగేష్ తమ్మినేనిని ‘అనకాపల్లి’ సినిమాతో పరిచయం చేస్తూ, యువ ప్రతిభను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను తెలిపారు.

ప్రముఖ దర్శకుడు త్రినాధ రావు నక్కిన వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.దర్శకుడిగా సినిమాలు చేస్తూనే ఇటీవలే నటుడిగాను మారాడు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను, అలాగే హలో గురు ప్రేమ కోసమే సినిమా అనుభవాలను పంచుకున్నారు. ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా స్క్రిప్ట్ అత్యంత సున్నితమైనదని, దానిని తెరపైకి తీసుకురావడం పెద్ద సవాలని త్రినాధ రావు నక్కిన పేర్కొన్నారు. హీరో రామ్ పోతినేనికి ఈ చిత్రం ఒక పెద్ద హిట్ ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లను వివరిస్తూ.. “ఇది పాజిటివ్ అండ్ నెగటివ్ మాథమెటిక్స్ లాంటిది. రెండు ప్యారలల్ లైన్స్ లాగా, ఎప్పుడూ కలవవు. అలాంటి కథను హ్యాండిల్ చేయడం చాలా కష్టం” అని ఆయన వివరించారు. దిల్ రాజు సైతం త్రినాధ్ నువ్వు మాస్ డైరెక్టర్ కదా, ఈ కథను ఎలా డీల్ చేస్తావు అని తొలుత సందేహించారని, అయితే సినిమా ఎడిటెడ్ వెర్షన్ చూసిన తర్వాత తనను అభినందించి గట్టిగా కౌగిలించుకున్నారని త్రినాధ రావు పంచుకున్నారు. ఈ సినిమాను టీవీలో చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఛానెల్ మార్చలేనంత ఆసక్తికరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి : ఏంటీ.. ఈవిడా ఆమె ఒక్కరేనా..!! ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ హాట్ బ్యూటీ ఈ అమ్మడు
తన కెరీర్ విధానం గురించి మాట్లాడుతూ, తాను ఒక కథను ఎంచుకున్న తర్వాత అది ఏ హీరోకు సరిపోతుందో ఆ హీరో దగ్గరికే వెళ్తానని త్రినాధ రావు స్పష్టం చేశారు. కేవలం సినిమా చేయాలనే ఉద్దేశంతో ఎవరినీ అడగనని ఆయన తెలిపారు. రవితేజ, రామ్ పోతినేని, నాని వంటి స్టార్ హీరోలతో తనకు మంచి అనుబంధం ఉందని, వారితో ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడేంత చనువు ఉందని చెప్పారు. కథ బాగుంటే వారే అంగీకరిస్తారని ఆయన తెలిపారు. ‘నేను లోకల్’ చిత్రం విడుదలైన తర్వాత అల్లు అర్జున్ తనను ఇంటికి పిలిచి మాట్లాడారని, అప్పుడు ఆయన తనకెంతో ఇష్టమైన ‘సినిమా చూపిస్త మావ’ సినిమా గురించి ప్రస్తావించారని త్రినాధ రావు నక్కిన గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తనకు ఒక విభిన్నమైన కథ ఆలోచన ఉందని, దాని గురించి అల్లు అర్జున్‌కు ఐదు నిమిషాలు వివరించగా, ఆయన ఆసక్తి చూపించి డెవలప్ చేయమని కోరారని చెప్పారు. అయితే, ఆ తర్వాత ఆ కథను తాను డెవలప్ చేయడానికి ప్రయత్నించినా అది తనకే పూర్తి స్థాయిలో నచ్చకపోవడంతో, ఆ విషయాన్ని అల్లు అర్జున్‌కు చెప్పి ముందుకు వెళ్లలేదని త్రినాధ రావు నక్కిన వివరించారు. నా కథ నాకు నచ్చనప్పుడు ఇతరులకు చెప్పడం సరికాదని ఆయన భావించారు.
ఇది కూడా చదవండి : దొరికేసింది మావ..! అగ్నిపరీక్ష ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి బయట ఎలా ఉందో చూశారా..
తాజాగా ‘అనకాపల్లి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న ఖగేష్ తమ్మినేని గురించి మాట్లాడుతూ, ఆయన పదేళ్లకు పైగా తనకు పరిచయమని త్రినాధ రావు నక్కిన తెలిపారు. ఖగేష్ షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ (శేఖర్ మాస్టర్ కోసం) తీసి తన దగ్గరకు వచ్చి చూపించేవాడని, అతడిలో ఉన్న టెక్నికల్ సౌండ్, సెన్సిబిలిటీ తనకు నచ్చాయని చెప్పారు. ‘అనకాపల్లి’ కథ అనుకున్నప్పుడు వెంటనే ఖగేష్‌ను పిలిచి, ఆ కథను వివరించానని తెలిపారు. ఇంత పెద్ద కథను తాను దర్శకత్వం చేయగలనా అని ఖగేష్ సందేహించగా, తాను వెనకుండి నడిపిస్తానని, స్క్రిప్ట్ రైటింగ్ సహా అన్ని విషయాల్లో మద్దతు ఇస్తానని భరోసా ఇచ్చి ప్రోత్సహించానని త్రినాధ రావు నక్కిన చెప్పారు. ఒక కొత్త కుర్రాడికి అవకాశం ఇవ్వడం వల్ల అతడికి మాత్రమే కాకుండా, పది నుండి పదిహేను మంది సాంకేతిక నిపుణులకు కూడా జీవితం దొరుకుతుందని, ఈ విషయంలో కొత్తవారికి అవకాశం ఇచ్చేవాళ్లు ఎప్పుడూ గొప్పవాళ్లే అని త్రినాధ రావు అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి : ఈ స్టార్ కమెడియన్ గుర్తున్నాడా.? ఆయన కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




