ఏంటీ.. ఈవిడా ఆమె ఒక్కరేనా..!! ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ హాట్ బ్యూటీ ఈ అమ్మడు
హీరోయిన్స్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోతుంటారు. కొంతమందిని గుర్తుపట్టడం కూడా కష్టం అయిపోతుంది. మొదటి సినిమాతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ మరింత అందంగా, మరింత గ్లామరస్ గా మారి ప్రేక్షకులను కవ్విస్తున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

అందాల భామలు చాలా మంది చూస్తూ చూస్తే మారిపోతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిపోతున్నారు. హీరోయిన్స్ ఓల్డ్ ఫొటోలతో పాటు ఇప్పటి లేటెస్ట్ ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఆ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మా హీరోయిన్ అప్పుడు ఇలా ఉండేదా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండదు. అప్పట్లో బొండు మల్లెలా ఉన్న ఆమె ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది అంతే కాదు. తన హాట్ నెస్‌తో కాక రేపుతోంది. స్లిమ్ గా మారిపోయి అందరిని అవాక్ అయ్యేలా చేస్తున్న ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా.? రీసెంట్ గానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తన నటనతో అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.
ఈ బ్యూటీ తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. ఆ సినిమా పర్లేదు అనిపించుకుంది. కానీ ఆసినిమాలో నటించిన ఈ భామ మాత్రం అందరి దృష్టి ఆకర్షించింది. ఆమె ఎవరంటే.. వామికా గబ్బి. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలో నటించిందని మీకు తెలుసా.? అవును సుదీర్ బాబు నటించిన సినిమాల్లో భలేమంచి రోజు గుర్తుందా.? శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2015లో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ భారీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఈ మూవీలో సుధీర్ బాబు తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది వామిక. అప్పుడు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది.
వామికా గబ్బి ఇప్పుడు ఆమె చాలా క్రేజ్ ఉన్న హాట్ బ్యూటీ. అవును వామికను ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. బాలీవుడ్ లో వరుస గా సినిమాలు చేస్తుంది. అలాగే గ్లామర్ పరంగానూ కవ్విస్తుంది. భలేమంచి రోజు సినిమా సమయంలో ఆమె కాస్త బొద్దుగా కనిపించింది ఈ చిన్నది. కానీ ఇప్పుడు జీరోసైజ్ లోకి మారి అందరిని అవాక్ అయ్యేలా చేస్తుంది. అంతే కాదు తన అందాలతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ పంజాబీ, హిందీ సినిమాలతో పాటు తెలుగు, మలయాళ సినిమాల్లోనూ నటించింది. మొన్నామధ్య వరుణ్ ధావన్ ,కీర్తిసురేష్ జంటగా నటించిన బేబీ జాన్ సినిమాలో నటించింది. అక్షయ్ కుమార్ నటిస్తున్న భూత్ బంగ్లా సినిమాలో నటించింది. రీసెంట్ గా లోకేష్ కనగ రాజ్ హీరోగా నటించిన డీసీ సినిమాలో హీరోయిన్ గా చేసి దుమ్మురేపింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే హాట్ ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
