Cinema: థియేటర్లలో 300 కోట్లకు పైగా కలెక్షన్లు.. OTTలో రికార్డు వ్యూస్.. ఇప్పుడు టీవీలోకి బ్లాక్ బస్టర్ మూవీ
ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆపై ఓటీటీలోనూ రిలీజై రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు టీవీలోకి వచ్చేస్తోంది. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు టాప్ రేటింగ్ దక్కడం విశేషం.

ప్రతి వారం సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సినిమాతో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ సూర్య, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వీరభద్రుడు’ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఈ ఆదివారం, సెప్టెంబర్ 27న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. తమిళంలో ‘కరుప్పు’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ వేదికగా తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఆర్.జే. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో యాక్షన్, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు చక్కగా మేళవించారు. కథానాయకుడి జీవితాన్ని ప్రభావితం చేసే బలమైన నమ్మకాలు, అనుబంధాలు, ఊహించని సంఘర్షణలు కథను మరింత ఉత్కంఠగా మారుస్తాయి. కుటుంబం, నమ్మకం, ధైర్యం వంటి అంశాలను స్పృశిస్తూ సాగే ఈ సినిమా సూర్య అభిమానులు కోరుకునే మాస్ యాక్షన్‌తో పాటు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలను అందిస్తుంది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ ఒక కీలక పాత్రలో కనిపించనుండగా, దర్శకుడు ఆర్.జే. బాలాజీ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతాన్ని సమకూర్చారు.
కరుప్పు (వీరభద్రుడు) సినిమా విషయానికి వస్తే.. ఇంద్రాన్స్, స్వాసిక, సుబ్రమణ్యం, సుప్రీత్ రెడ్డి, మన్సూర్ అలీఖాన్, జార్జ్ మరియన్, ఆడుకలం నరేన్, వేలా రామమూర్తి, శాండీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చారు. కాగా వీరభద్రుడు సినిమాలో క్లైమాక్స్ హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా దేవుడి పాత్రలో సూర్య అదరగొట్టాడు. ఇక లాయర్ పాత్రలో త్రిష చాలా అందంగా కనిపించింది. ఆకట్టుకునే కథనం, యాక్షన్, ఎమోషన్ల కలయికతో రూపొందిన ‘వీరభద్రుడు’.. ఈ ఆదివారం మీ జీ తెలుగులో!
జీ తెలుగులో సూర్య త్రిషల బ్లాక్ బస్టర్ సినిమా వీరభద్రుడు.. ఈ వీకెండ్ లోనే టెలికాస్ట్..
A rollercoaster ride of fun and entertainment 🎬🔥
Don’t miss World Television Premiere #Veerabhadrudu This Sunday at 6PM on #ZeeTelugu#ZeeTeluguSpotlight pic.twitter.com/D8i7C6KfsV
— ZEE TELUGU (@ZeeTVTelugu) September 23, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




