Jai Bhim: జైభీమ్ సినిమా వివాదంపై స్పందించిన డైరెక్టర్.. కావాలని సూర్యను టార్గెట్ చేస్తున్నారంటూ..
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సూర్య నటనకు ప్రశంసలు వచ్చాయి. అయితే మరోవైపు ఈ సినిమాపై వరుస వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులోని కొన్ని సన్నివేశాలు ఓ వర్గం వారిని కించపరిచేలా ఉన్నాయని.. ఈ క్రమంలో నటుడు సూర్య తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. సూర్యను కొట్టిన వారికి లక్ష రూపాయాలు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. తాజాగా ఈ వివాదంపై జైభీమ్ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ స్పందించారు. భైభీమ్ వివాదానికి పూర్తి బాధ్యత వహించాలంటూ సూర్యను టార్చర్ చేస్తున్నారని.. ఇది అన్యాయమని.. దర్శకుడిగా ఆ బాధ్యత తనదని తెలిపారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ..”విడుదలకు ముందు మా యూనిట్ సభ్యులు కొద్ది మంది సినిమా చూశాం.. కానీ అభ్యంతరకరమైన క్యాలెండర్ దృశ్యాన్ని మేం గమనించలేదు. అప్పుడే చూసి ఉంటే సినిమా విడుదలకు ముందే తొలగించేవాడిని. చిత్రం విడుదలైన రోజు నుంచి దీనిపై కొందరు అసహనం వ్యక్తం చేశారు. వివాదం ముదరకముందే సంబధింత సన్నివేశంలో మార్పులు చేశాం. ఆ సమయంలో ప్రేక్షకులు అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను.. అయినా ఈ విషయంపై సూర్య బాధ్యత వహించాలని కొందరు కోరుతున్నారు. కావాలని ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఇలా చేయడం భావ్యం కాదు. దర్శకుడిగా ఆ బాధ్యత నాది. అతను ఓ నటుడిగా.. నిర్మాతగా గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడంతే… ఇప్పటి వరకు జరిగిన పరిణామాల విషయంలో సూర్యను క్షమించమని కోరుతున్నా.. ఓ వ్యక్తినో.. ఓ వర్గాన్నో కించపరిచే ఉద్దేశంతో సినిమాను తెరకెక్కించలేదు. ఈ సినిమా వలన బాధపడిన వారికి క్షమపణలు చెబుతున్నాను .. మాకు అండగా నిలిచిన వారికి దన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు .
Also Read: Gamanam: ప్రేక్షకుల ముందుకు గమనం.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రయూనిట్..
Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేట్.. ఒక్కొక్కరికి గురించి ఏం చెప్పిందంటే..