Cinema : రాజేంద్ర ప్రసాద్ రిజెక్ట్ చేసిన పాటతో హిట్టు కొట్టిన బాబూ మోహన్.. ఇప్పటికీ ట్రెండింగ్..
డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేశారు. ఆయన రూపొందించిన సినిమాలు ఇఫ్పటికీ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఆయన చిత్రాలు వస్తుంటే చాలు అందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, పలు చిత్రాల చిత్రీకరణ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి తన కెరీర్ ఆరంభ దశలో ఎదురైన సవాళ్లను, ముఖ్యంగా నటుడు రాజేంద్ర ప్రసాద్‌తో పనిచేసిన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ఎప్పుడూ జీరోలను హీరోలు చేయాలనే లక్ష్యంతోనే పనిచేశానని, తన సినిమా ఒక అద్భుతాన్ని సృష్టించాలనే సంకల్పంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. చిన్న, పెద్ద అనే బేధాలు తనకు లేవని, కథ, నూతనత్వం, ప్రేక్షకులకు నాణ్యమైన సినిమా అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని వివరించారు. రాజేంద్ర ప్రసాద్‌తో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, ఆయన తనకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడం తన అదృష్టమని, కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. అయితే, తాను ఎదుగుతున్న దశలో రాజేంద్ర ప్రసాద్ తనను చిన్నవాడిగా, కొత్తవాడిగా చూశారని, తన ఆలోచనా విధానాన్ని తక్కువ అంచనా వేశారని కృష్ణా రెడ్డి అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.
మాయలోడు సినిమా నిర్మాణ సమయంలో రాజేంద్ర ప్రసాద్‌తో డబ్బింగ్, ఒక పాట చిత్రీకరణ విషయంలో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమాలోని చినుకు చినుకు అందెలతో పాట కోసం రాజేంద్ర ప్రసాద్ పాట చిత్రీకరణకు డేట్లు అడ్జస్ట్ కాలేకపోయాయి. సౌందర్య డేట్లు ఇచ్చినా, తాను సహకరించలేనని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దీంతో ఆయన స్థానంలోకి బాబూ మోహన్ ను తీసుకున్నారు. ఎస్.వి. కృష్ణా రెడ్డి బాబు మోహన్‌ను సంప్రదించి, సౌందర్య పక్కన పాటలో నటించమని కోరారు. బాబు మోహన్ అంగీకరించారు. కృష్ణా రెడ్డి తన దృఢ సంకల్పాన్ని, సినిమాపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ “నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది” అని నమ్మకంతో ఉన్నారట.
ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..
చివరకు మాయలోడు సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది, బాబు మోహన్ చేసిన పాట అద్భుతంగా ప్రజాదరణ పొందింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 90ల కాలంలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి తెరకెక్కించిన అద్భుతమైన హాస్య రసాత్మక చిత్రం ‘మాయలోడు’. రాజేంద్ర ప్రసాద్ హీరోగా, సౌందర్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా 1993లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.‘మాయలోడు’ సినిమా కమర్షియల్‌గానే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రానికి గాను ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది అవార్డు దక్కింది.
ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..
ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‌లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..
