Sukumar: డైరెక్టర్ సుకుమార్ పెద్ద మనసు.. తండ్రి జ్ఞాపకార్థంగా సొంత గ్రామంలో…

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. తన తండ్రి జ్ఞాపకార్థంగా.. సొంత గ్రామంలో చదువుకున్న స్కూల్‏లో దాదాపు

Sukumar: డైరెక్టర్ సుకుమార్ పెద్ద మనసు.. తండ్రి జ్ఞాపకార్థంగా సొంత గ్రామంలో...
Sukumar
Follow us

|

Updated on: Aug 02, 2021 | 9:40 AM

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. తన తండ్రి జ్ఞాపకార్థంగా.. సొంత గ్రామంలో చదువుకున్న స్కూల్‏లో దాదాపు రూ.20 లక్షలు ఖర్చు పెట్టి అదనపు భవనం నిర్మించారు. పాఠశాల అవసరాల కోసం సుకుమార్ ప్రత్యేక భవనం నిర్మించి ఇవ్వడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. తూర్పు గోదావిరి జిల్ల మట్టపర్రులో తన తండ్రి జ్ఞాపకార్థంగా పాఠశాల అదనపు భవనాన్ని నిర్మించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్‏తో కలిసి సుకుమార్ దంపతులు ఈ భవనాన్ని నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా.. సుకుమార్ మాట్లాడుతూ.. సొంత గ్రామాభివృద్ధికి తాను ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. తన తండ్రి పేరుతో స్కూల్ భవనం నిర్మించి..ప్రారంభించిన క్షణాలను మర్చిపోలేనివంటూ భావోద్వేగానికి గురయ్యారు.

సుకుమార్ ఇప్పటివరకు మట్టపర్రు గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నాడు. సొంత గ్రామంలోనే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో కూడా తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలను నిర్వహించాడు. ఇప్పటి వరకు సుకుమార్ భారీ ఎత్తున ఖర్చు చేసి మౌళిక వసతుల మొదలుకుని ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను సుకుమార్ సొంత ప్రాంతం కోసం చేశాడు అంటూ స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సుకుమార్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో పుష్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక చందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. లాక్ డౌన్ అనంతరం ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్.. తాజాగా సుకుమార్ అస్వస్థతకు గురికావడంతో వాయిదా పడింది. తిరిగి సెప్టెంబరులో ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

Also Read:

Poorna: నయనతార నాకు స్పూర్తి.. ఆమెలా చేయాలని ఉంది.. పూర్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…

Nagarjuna Bangarraju: ఎట్టకేలకు ముహుర్తం ఫిక్స్.. సెట్స్ పైకి వెళ్లనున్న ‘బంగార్రాజు’..

Jaqueline Fernandez: ‘రక్కమ్మత్త’గా బాలీవుడ్ హీరోయిన్.. రంగమ్మత్తను మైమరపిస్తుందా ?