Poorna: నయనతార నాకు స్పూర్తి.. ఆమెలా చేయాలని ఉంది.. పూర్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Aug 02, 2021 | 9:15 AM

పూర్ణ.. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన సీమ టపాకాయ్ సినిమాతో గుర్తింపు హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత డైరెక్టర్

Poorna: నయనతార నాకు స్పూర్తి.. ఆమెలా చేయాలని ఉంది.. పూర్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
Poorna

Follow us on

పూర్ణ.. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన సీమ టపాకాయ్ సినిమాతో గుర్తింపు హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత డైరెక్టర్ రవిబాబు తెరకెక్కించిన అవును, లడ్డుబాబు, అవును 2 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక ఆ తర్వాత పూర్ణకు తెలుగులో అవకాశాలు అంతగా రాలేదు. దీంతో కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో కలిపి మొత్తం 40 సినిమాల్లో నటించింది పూర్ణ. ఇక ప్రస్తుతం బుల్లితెరపై ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహిస్తుంది ఈ మలయాళీ భామ.

అటు బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తూనే.. అటు అడపాదడపా సినిమాలు చేస్తూంది పూర్ణ. ప్రస్తుతం డైరెక్టర్ కళ్యాణ్ జీ గోగన తెరకెక్కించిన సుందరి సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఇందులో హీరోగా బుల్లితెర నటుడు అర్జున్ అంబటి నటించారు. రిజ్వాన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 13 విడుదల కానుంది. ఈ సందర్భాంగా.. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పూర్ణ మాట్లాడుతూ.. సుందరి సినిమాలో నేను చేసినది స్టార్ హీరోయిన్స్ స్థాయివారు చేసే పాత్ర. నేను ఇంకా ఆ స్థాయికి రాలేదు. కానీ నా మీద నమ్మకంతో దర్శక – నిర్మాతలు ఈ సినిమా తీసినందుకు ధన్యవాదాలు. నాకు నయనతార స్పూర్తి. ఆమెలా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటించాలని ఉందన్నారు. అనంతరం చిత్రనిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. సుందరి సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే ఇన్ని రోజులు వెయిట్ చేశాం. మా సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతుందన్నారు. ఎదురుగా ఓ మనిషి ఉంటే సరిగ్గా మాట్లాడటానికి భయపడే ఓ అమ్మాయి అతిగా స్పందిస్తే ఎలా ఉంటుంది? అన్నదే ఈ సినిమా కథ అన్నారు కల్యాణ్‌ జి గోగన.

Also Read:

Nagarjuna Bangarraju: ఎట్టకేలకు ముహుర్తం ఫిక్స్.. సెట్స్ పైకి వెళ్లనున్న ‘బంగార్రాజు’..

Jaqueline Fernandez: ‘రక్కమ్మత్త’గా బాలీవుడ్ హీరోయిన్.. రంగమ్మత్తను మైమరపిస్తుందా ?

Pooja Hegde: కోలీవుడ్‏లో బిజీగా పుజా హెగ్డే.. మరో స్టార్ హీరో పక్కన చాన్స్ కొట్టేసిన..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu