RRR Movie: న్యూయార్క్‏లో ఆర్ఆర్ఆర్ హావా.. జక్కన్న ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. కేవలం మన దేశంలోనే కాకుండా.. విదేశాల్లోనూ సత్తా చాటింది. ముఖ్యంగా అమెరికాలో ట్రిపుల్ ఆర్ హావా కొనసాగుతుంది.

RRR Movie: న్యూయార్క్‏లో ఆర్ఆర్ఆర్ హావా.. జక్కన్న ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డ్..
Rajamouli
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 03, 2022 | 9:26 PM

ప్రస్తుతం ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూస్తుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన జక్కన్న.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంతో హాలీవుడ్ డైరెక్టర్స్‏ను ఫిదా చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. కేవలం మన దేశంలోనే కాకుండా.. విదేశాల్లోనూ సత్తా చాటింది. ముఖ్యంగా అమెరికాలో ట్రిపుల్ ఆర్ హావా కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ విడుదలై భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. జపాన్‏లోనూ రికార్డ్స్ లను తిరగరాసింది. ఈ సినిమాతో పాన్ ఇండియన్ పితామహుడనే నామ్ కమాయించారు జక్కన్న. ఇండియాన్ డైరెక్టర్లలో.. నెంబర్ 1 తనే అనే టాక్ తెచ్చుకున్నారు. డైరెక్టర్లందరూ తననే ఫాలో అయ్యేలా కూడా చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ఓ ఇంటర్నేషనల్ అవార్డునే అందుకున్నారు మన జక్కన్న.

ఇండియన్ టిపికల్ ఎమోషన్‌ను… ఇద్దరి మధ్య ఉన్న దోస్తీనీ ఎంతో ఎమోషనల్‌గా లార్జర్ దెన్ లైఫ్‌గా.. ట్రిపుల్ ఆర్ సినిమాలో చూపించిన జక్కన్న… ఆ సినిమాతో హాలీవుడ్లోనే డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన ట్యాలెంట్‌తో.. హాలీవుడ్‌లో విపరీతంగా బజ్ చేశారు. తనకంటూ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఇక తాజాగా న్యూయార్క్‌ క్రిటిక్స్ ఇచ్చే అవార్డ్స్‌లలో బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు రాజమౌళి. అందుకోవడమే కాదు… ఈ అవార్డుతో.. తెలుగు వాన్ని ట్యాలెంట్‌ ఏంటో.. మరోసారి ప్రపంచానికి చూపించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాలర్‌ ఎగరేసేలా చేశారు.

ఇవి కూడా చదవండి

న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ 1935లో స్థాపించారు. ఇందులో సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేస్తారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పటికే శాటర్న్, సన్ సెట్ సర్కిల్ వంటి పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. మరోవైపు ఆస్కార్ బరిలోనూ పోటీ పడుతుంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!