SS Rajamouli: ‘ఆ స్క్రిప్ట్ చదువుతూ చాలాసార్లు ఏడ్చాను’.. RSS స్టోరీ పై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..

అంతర్జాతీయ పబ్లికేషన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రూపొందించిన ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్నో సినిమాలకు స్టోరీస్ అందించిన విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) స్క్రిప్ట్ రాస్తున్నారు.

SS Rajamouli: 'ఆ స్క్రిప్ట్ చదువుతూ చాలాసార్లు ఏడ్చాను'..  RSS స్టోరీ పై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..
Rajamouli, Vijayendra Prasa
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2023 | 1:20 PM

ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు డైరెక్టర్ రాజమౌళి. దాదాపు రూ. 400 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ. 1200 కోట్లు వసూళు చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ మూవీ ఇప్పటివరకు ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆస్కార్ అవార్డులలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యింది. ఈ క్రమంలో ఇటీవలే అంతర్జాతీయ పబ్లికేషన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రూపొందించిన ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్నో సినిమాలకు స్టోరీస్ అందించిన విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) స్క్రిప్ట్ రాస్తున్నారు.

“నాకు ఆర్ఎస్ఎస్ గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ సంస్థ గురించి కొంచమే విన్నాను. కానీ అది ఎలా ఏర్పడింది.. వారి నమ్మకాలు ఏమిటి, వారు ఎలా అభివృద్ధి చెందారు.. ఇవన్నీ నాకు తెలియదు. కానీ నేను మా నాన్న గారు రాసి న స్క్రిప్ట్ చదివాను. చాలా ఎమోషనల్ స్టోరీ అది. ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు చాలాసార్లు ఏడ్చాను. స్క్రిప్ట్ లోని డ్రామా నన్ను భావోద్వేగానికి గురించింది. కానీ ఆ రియాక్షన్‌కి కథలోని హిస్టరీ పార్ట్‌తో సంబంధం లేదు.”

ఇవి కూడా చదవండి

“నేను చదివిన స్క్రిప్ట్ చాలా ఎమోషనల్ , చాలా బాగుంది. కానీ అది సమాజానికి ఏమి సూచిస్తుందో నాకు తెలియదు. మా నాన్న రాసిన స్క్రిప్ట్‌కి నేను దర్శకత్వం వహిస్తానా? లేదా ? అని అందరు నన్ను అడుగుతున్నారు. కానీ వీలు అవుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మా నాన్న ఈ స్క్రిప్ట్‌ను వేరే సంస్థ, వ్యక్తులు లేదా వేరే నిర్మాత కోసం రాశారో లేదో నాకు తెలియదు. అందుకే నా దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు. ఆ కథకు దర్శకత్వం వహించడం నాకు గర్వకారణం, ఎందుకంటే ఇది చాలా అందమైన, మానవీయ, భావోద్వేగ నాటకం. కానీ స్క్రిప్ట్ లోని సవాళ్ల గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. ఇది ప్రతికూల ప్రభావాన్ని లేదా సానుకూల ప్రభావాన్ని కలిగిస్తుందని నేను చెప్పడం లేదు. తొలిసారిగా నాకు ఖచ్చితంగా తెలియదు,” అంటూ చెప్పుకొచ్చారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!