- Telugu News Entertainment Tollywood These telugu movies must watch maha shivaratri night telugu cinema news
Maha Shivaratri: శివరాత్రి జాగారం సమయంలో తప్పకుండా చూడాల్సిన శివయ్య సినిమాలు ఇవే..
మహా శివుడికి ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. తెలుగు రాష్ట్రాల్లో ముక్కంటి నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతోమంది భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తున్న ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Updated on: Feb 18, 2023 | 1:00 PM

మహా శివుడికి ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. తెలుగు రాష్ట్రాల్లో ముక్కంటి నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతోమంది భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తున్న ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక మహాశివరాత్రి రోజు నిద్రపోకుండా జారగణ చేయడం సంప్రదాయం. కాలం మారుతుంది. భజన గీతాలతో కాకుండా ఇటీవల భక్తి సినిమాలు చూస్తూ ఈ శివయ్యను తలుచుకుంటూ జాగరం చేస్తున్నారు. ఈ శివరాత్రికి శివయ్య మీద భక్తిని పెంపొందించే సినిమాల గురించి తెలుసుకుందామా.

శ్రీమంజునాథ.. చిరంజీవి ఆ పరమేశ్వరుడిగా కనిపించగా... ఆయన భక్తులుగా అర్జున్, సౌందర్య అద్భుతంగా నటించారు.

అలాగే కాళహస్తి మహత్యం.. కన్నడ నటుడు రాజ్ కుమార్ నటించిన సినిమా. 1954లో విడుదలైంది.

శివలీలలు, భక్త మార్కండేయ, దక్షయజ్ఞం సినిమాలు కూడా మహాశివరాత్రి జాగరం సమయంలో చూడాల్సిన చిత్రాలు.

శివకన్య, భక్త కన్నప్ప, ఉమాచండీ గౌరీశంకరుల కథ సినిమాలు జాగరం సమయంలో చూడాలి.

మావూళ్లో మహాశివుడు, మహాశివరాత్రి సినిమాలు ఈ శివరాత్రికి జాగరం సమయంలో చూడాల్సిన చిత్రాలు.

మావూళ్లో మహాశివుడు, మహాశివరాత్రి సినిమాలు ఈ శివరాత్రికి జాగరం సమయంలో చూడాల్సిన చిత్రాలు.