SS Rajamouli: చిరకాల ప్రాజెక్ట్ పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘మహాభారతం’ పదిభాగాలు..
ఆస్కార్ అవార్డ్ అందుకుని హిస్టరీ క్రియేట్ చేసిన జక్కన్నకు ఓ కలల ప్రాజెక్ట్ ఉందనే సంగతి తెలిసిందే. అదే ఇతిహాస గాథ మహాభారతం. ఎప్పటికైనా ఆ సినిమా తీస్తానని అనేక సందర్బాల్లో తెలిపారు. దీంతో జక్కన్న తెరకెక్కించబోయే మహాభారతం సినిమాలో మన టాలీవుడ్ స్టార్స్ ఏఏ పాత్రలలో నటిస్తే బాగుంటుందని.. ఇప్పటికే పాత్రలను డిజైన్ చేసిన పోస్టర్స్ నెట్టింట వైరలయ్యాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నారు డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. హాలీవుడ్ డైరెక్టర్లను మెప్పించింది. ఈసినిమాకు ఆస్కార్ అవార్డ్ అందుకుని హిస్టరీ క్రియేట్ చేసిన జక్కన్నకు ఓ కలల ప్రాజెక్ట్ ఉందనే సంగతి తెలిసిందే. అదే ఇతిహాస గాథ మహాభారతం. ఎప్పటికైనా ఆ సినిమా తీస్తానని అనేక సందర్బాల్లో తెలిపారు. దీంతో జక్కన్న తెరకెక్కించబోయే మహాభారతం సినిమాలో మన టాలీవుడ్ స్టార్స్ ఏఏ పాత్రలలో నటిస్తే బాగుంటుందని.. ఇప్పటికే పాత్రలను డిజైన్ చేసిన పోస్టర్స్ నెట్టింట వైరలయ్యాయి. తాజాగా ఈ సినిమాపై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు రాజమౌళి. ఒకవేళ ఈ సినిమాను తెరకెక్కిస్తే.. దానిని పది భాగాలుగా ఉంటుందేమోనని అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళిని ” గతంలో మీరు మహాభారతం తీస్తానని అన్నారు.. అద్భుతమైన ఆ దృశ్యకావ్యం టెలివిజన్ లో 266 ఎపిసోడ్స్ గా ప్రసారమైంది. మీరు తీయాలనుకుంటే ఎన్ని భాగాలుగా తీస్తారు అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఇందుకు జక్కన్న స్పందిస్తూ.. “నాకు కూడా తెలియదండీ.. ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఒకవేళ మహాభారతం తీయాలంటే భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని వెర్షన్స్ చదవాలంటేనే ఏడాదిపైనే సమయం పట్టవచ్చు. అప్పటికి ఒక్క అక్షరంకూడా పేపర్ పై పెట్టలేకపోవచ్చు. చాలా పెద్ద ప్రాజెక్ట్. మహాభారతం తీస్తే పది భాగాలు తీయాల్సి వస్తుందేమోనని నేను ఊహించుకుంటున్నాను.. అయితే ఎన్ని భాగాలు అవుతుందో మాత్రం కచ్చితంగా చెప్పలేను ” అని అన్నారు. దీంతో మహాభారతంపై నెట్టింట చర్చ మొదలైంది.




సాధారణంగా జక్కన్న ఒక్క సినిమా సినిమాకు దాదాపు రెండేళ్లు సమయం తీసుకుంటారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా అంటే రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. అలాంటి ఇప్పుడు పది భాగాలుగా సినిమా అంటే.. దాదాపు పది నుంచి పన్నేండేళ్లు పైనే పడుతుందని అంటున్నారు నెటినజ్స్. ప్రస్తుతం రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్క్రీప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. సూపర్ స్టా్ర్ మహేష్ బాబుతో ఆయన నెక్ట్స్ సినిమా చేయనున్నారు.




