Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouli: మీ అభిమానికి పొంగిపోయాను.. టెస్లా కార్స్ వీడియోపై రాజమౌళి రియాక్షన్..

తాజాగా న్యూజెర్సీలో టెస్లా కార్లతో ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ప్రదర్శించిన ఓ స్పెషల్ వీడియో నెట్టింట వైరలయ్యింది. ఈ వీడియో చూసిన రాజమౌళి స్పందిస్తూ.. అద్భుతమంటూ కొనియాడారు.

SS Rajamouli: మీ అభిమానికి పొంగిపోయాను.. టెస్లా కార్స్ వీడియోపై రాజమౌళి రియాక్షన్..
Rajamouli
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2023 | 8:59 AM

ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ గురించి చెప్పక్కర్లేదు. విశ్వవేదికపై గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ సొంతం చేసుకోవడమే కాకుండా..ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గెలిచిన ఆస్కార్ కైవసం చేసుకుని భారతీయ సినిమా చరిత్రలో నిలిచింది. ఇందులో నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు చిన్న, పెద్దా అనే తేడా లేకుండా స్టెప్పులేస్తున్నారు. తాజాగా న్యూజెర్సీలో టెస్లా కార్లతో ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ప్రదర్శించిన ఓ స్పెషల్ వీడియో నెట్టింట వైరలయ్యింది. ఈ వీడియో చూసిన రాజమౌళి స్పందిస్తూ.. అద్భుతమంటూ కొనియాడారు.

“న్యూజెర్సీ నుంచి నాటు నాటు పాటకు మీరు చూపిన అభిమానానికి నిజంగా పొంగిపోయాను. మీ అందరికీ ధన్యావాదాలు. ఇంతటి అద్భుతమైన వీడియోను ప్రదర్శించిన ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. నాటు నాటు పాటకు టెస్లా కార్లతో లైట్ షో ఒక అద్భఉతమైన అనుభూతి” అంటూ పోస్ట్ చేశారు జక్కన్న.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి జక్కన్న భారీ అడ్వెంచర్ చిత్రం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి పలు ఇంటర్వ్యూలలో స్పందించారు జక్కన్న. త్వరలోనే వీరిద్దరి కాంబో షూరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

థియేటర్స్‌లో దారుమైన డిజాస్టర్.. కట్ చేస్తే ఓటీటీలో..
థియేటర్స్‌లో దారుమైన డిజాస్టర్.. కట్ చేస్తే ఓటీటీలో..
రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఈ రంగాలకు పెద్ద పీట!
రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఈ రంగాలకు పెద్ద పీట!
నా భార్యను ఇంటికి పంపిస్తారా.. లేదా? నడిరోడ్డుపై భర్త హల్‌చల్
నా భార్యను ఇంటికి పంపిస్తారా.. లేదా? నడిరోడ్డుపై భర్త హల్‌చల్
ఓటీటీలోకి వచ్చేసిన తండ్రీ కొడుకుల సినిమా 'బ్రహ్మా ఆనందం'
ఓటీటీలోకి వచ్చేసిన తండ్రీ కొడుకుల సినిమా 'బ్రహ్మా ఆనందం'
హైదరాబాద్‌ కుర్రోడి సత్తా.. రూ.3 కోట్ల వార్షిక వేతనంతో కొలువు!
హైదరాబాద్‌ కుర్రోడి సత్తా.. రూ.3 కోట్ల వార్షిక వేతనంతో కొలువు!
ఇండియా తీసేసి.. భారత్‌ పెట్టండి! హైకోర్టు ఆదేశం
ఇండియా తీసేసి.. భారత్‌ పెట్టండి! హైకోర్టు ఆదేశం
రిలయన్స్‌ జియో నుంచి మూడు చౌకైన ప్లాన్స్‌..వ్యాలిడిటీ, బెనిఫిట్స్
రిలయన్స్‌ జియో నుంచి మూడు చౌకైన ప్లాన్స్‌..వ్యాలిడిటీ, బెనిఫిట్స్
నేడే పాలిసెట్‌ 2025 నోటిఫికేషన్‌.. ఈసారి సీట్లన్నీ మనకే!
నేడే పాలిసెట్‌ 2025 నోటిఫికేషన్‌.. ఈసారి సీట్లన్నీ మనకే!
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా వచ్చేస్తోంది.
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా వచ్చేస్తోంది.
క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు.. అందర్నీ బయటకు లాగుతాం..
క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు.. అందర్నీ బయటకు లాగుతాం..