AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ఏపీ సీఎం పవన్‌ కల్యాణ్ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అని చెప్పుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నా: ఎస్‌ జే సూర్య

ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. ఇలా రెండు పడవల మీద అలుపెరగని ప్రయాణం చేస్తున్నాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. టాలీవుడ్‌లో వన్‌ ఆఫ్‌ది టాప్‌ హీరోగా చెలామణి అవుతోన్న ఆయన జనసేన పార్టీ అధిపతిగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.

Pawan Kalyan: ఏపీ సీఎం పవన్‌ కల్యాణ్ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అని చెప్పుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నా: ఎస్‌ జే సూర్య
SJ Surya, Pawan Kalyan
Basha Shek
|

Updated on: Mar 11, 2023 | 6:23 PM

Share

ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. ఇలా రెండు పడవల మీద అలుపెరగని ప్రయాణం చేస్తున్నాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. టాలీవుడ్‌లో వన్‌ ఆఫ్‌ది టాప్‌ హీరోగా చెలామణి అవుతోన్న ఆయన జనసేన పార్టీ అధిపతిగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్‌ సినిమాల్లోకి అడుగుపెట్టి నేటి (మార్చి 11)తో 27 సంవత్సరాలు పూర్తయ్యాయి. అలాగే జనసేన పార్టీ ఆవిర్భవించి ఈనెల 14 నాటికి 9 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని వివిధ రంగాలకు చెందిన పలువురు దర్శక నిర్మాతలు పవన్‌కు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఏ.ఎం. రత్నం రిలీజ్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా పవన్‌తో ఖుషీ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్‌ కమ్‌ యాక్టర్‌ ఎస్‌.జె.సూర్య పవన్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపాడు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎంగా పవన్‌ను చూడాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘ 27 ఏళ్ల పవనిజం.. పవన్‌ కల్యాణ్‌.. ఇట్ జస్ట్‌ నాట్‌ ఏ నామ్‌.. మిలియన్ల కొద్దీ అభిమానులకు, ఈ దేశానికి ఎంతో నమ్మకం విశ్వాసం పవన్‌ కల్యాణ్‌ అంటే. ఆయన వెండి తెరపైనే కాదు.. జనాల్లో కూడా హీరోనే. ఆయన గ్రేట్ పొలిటికల్ లీడర్. సినిమా ఇండస్ట్రీకి 27 ఏళ్ల పాటు సేవలందించారు. అలాగే జనసేన అధిపతిగా 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రజల కోసం పవన్‌ చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం చాలామంది లాగే నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని వీడియోలో చెప్పుకొచ్చాడు సూర్య. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా పవన్‌- ఎస్‌.జే. సూర్య కాంబినేషన్‌లో ఖుషీ అనే సినిమా వచ్చింది. ఇది ఇండస్ట్రీ రికార్డులను తిరగేసింది. అయితే ఇదే కాంబినేషన్లో వచ్చిన కొమరం పులి మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయితే వీరిద్దరి మధ్య సినిమాలకు మించిన స్నేహముంది. దీనిని నిరూపిస్తూ పలు సందర్భాల్లో పవన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు ఎస్‌జే సూర్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..