AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vargin Story Movie Teaser: సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ‘వర్జిన్ స్టోరి’ మూవీ టీజర్..

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి

Vargin Story Movie Teaser: సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా 'వర్జిన్ స్టోరి' మూవీ టీజర్..
Sekhar Kammula
Rajeev Rayala
|

Updated on: Nov 01, 2021 | 6:25 AM

Share

Vargin Story : నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్. ప్రస్తుతం ఆయన దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ బాయ్స్ లో కీరోల్ ప్లే చేస్తున్నారు. విక్రమ్ హీరోగా చేస్తున్న డెబ్యూ మూవీ వర్జిన్ స్టోరి. కొత్తగా రెక్కలొచ్చెనా..అనేది క్యాప్షన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి వర్జిన్ స్టోరి చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని టీజర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. శ్రీధర్ గారు నాకు చాలా కాలంగా స్నేహితులు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయనకు సినిమాలంటే ఇష్టం. నేనే కాదు ఎవరు మంచి సినిమా చేసినా ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ఫిల్మ్ స్కూల్ లో చదివిన వాళ్లు బయటకొచ్చి యంగ్ టాలెంట్ తో సినిమాలు చేస్తుంటారు. నేనూ అలాగే చేశాను. ఇప్పుడు ప్రదీప్ కూడా కొత్తవాళ్లతో తన తొలి సినిమా చేస్తున్నారు. వర్జిన్ స్టోరి టీజర్, పాటలు చూశాను. చాలా బాగున్నాయి. విక్రమ్ చక్కగా నటించాడు. యూత్ ఆడియెన్స్ కు వర్జిన్ స్టోరి సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను. సినిమా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mehreen Pirzada: ఆ ఇద్దరు హీరోయిన్స్‌లా సినిమాలు చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన మెహ్రీన్..

Bommarillu Bhaskar‌: మరో మెగా పవర్ ఆఫర్ కొట్టేసిని బొమ్మరిల్లు భాస్కర్‌.. ఇది నిజమేనా అంటున్న అభిమానులు.. (వీడియో)

Anubhavinchu Raja: ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి హాయిగా నవ్వుకునే సినిమా మాది: రాజ్ తరుణ్