AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehreen Pirzada: ఆ ఇద్దరు హీరోయిన్స్‌లా సినిమాలు చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన మెహ్రీన్..

సంతోష్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ జంటగా మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా“మంచి రోజులు వచ్చాయి”.

Mehreen Pirzada: ఆ ఇద్దరు హీరోయిన్స్‌లా సినిమాలు చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన మెహ్రీన్..
Mehreen
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2021 | 10:15 PM

Share

Mehreen Pirzada: సంతోష్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ జంటగా మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా“మంచి రోజులు వచ్చాయి”. టాక్సీవాలా తర్వాత ఎస్ కే ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, యూవీ, SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు వస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కు సిద్ధమైన సందర్భంగా హీరోయిన్ మెహ్రీన్ మాట్లాడుతూ.. సినిమా విశేషాలను పంచుకున్నారు. యువి క్రియేషన్స్, యస్.కె.యన్, మారుతీ గార్ల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఇది చాలా మంచి సబ్జెక్టు మారుతి గారు కాన్సెప్ట్ చాలా బాగుంటాయి .నా లైఫ్ లో కనెక్ట్ అయిన ఫస్ట్ మూవీ ఇది.ఇంత మంచి టీం తో చాలా ఎంజాయ్ చేస్తూ..వర్క్ చేయడం జరిగింది. ఈ సినిమాలో పద్దు క్యారెక్టర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పాత్ర చేస్తున్నాను.ఈ సినిమా  మారుతి గారు స్టైల్ లో ఫుల్ ఎంటర్టైనర్ జోనర్లో ఉంటుంది అని చెప్పుకొచ్చింది మెహ్రీన్.

అలాగే ఇది ఒక కాలనీలో జరిగే కథ .ఇలాంటి కథలు ప్రతి ఇంట్లో జరుగుతుంటాయి.అలాంటి స్టోరీని కథగా తీసుకొని ఎంటర్టైన్మెంట్ రూపకంగా ప్రేక్షకులకు చూపించడం జరుగుతుంది.ఈ సినిమాలో మేము చూయించిన సీన్స్, స్విచ్వేషన్స్ కోవిడ్ టైం లో చాలా మందికి జరిగాయి అంది.  నేను చేసిన F2, F3 సినిమాలలో చేసిన పాత్రలకంటే ఇందులో నేను చేస్తున్న పాత్ర డిఫరెంట్. నేను నార్మల్గానే చాలా ఫన్నీగా ఉంటాను. అందువల్ల నేను చేసే క్యారెక్టర్స్ లలో అల్లరి అయినా, కామెడీ అయినా చేయడం నాకు చాలా ఈజీ అనిపిస్తుంది.ఇందులో కూడా నా క్యారెక్టర్ మంచి ఎమోషన్స్ తో ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్యాకేజ్డ్ గా ఉంటుంది అని చెప్పుకొచ్చింది.

అలాగే మహానటి లో చేసిన కీర్తి సురేష్ క్యారెక్టర్ ,ఓ బేబీ సినిమాలో సమంత చేసిన క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం.ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే నాకు చేయాలని ఉంది అని మనసులో మాట చెప్పింది మెహ్రిన్. కన్నడలో శివరాజ్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా అయిన తర్వాత వేరే సినిమాలు ఉన్నాయి. తెలుగులో కూడా కొన్ని స్టోరీస్ వింటున్నాను. వాటిని డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అని చెప్పుకొచ్చింది మెహ్రీన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kalyani Priyadarshan : పాలరాతి శిల్పంలా ఫోటోలకు ఫోజులిచ్చిన ముద్దగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్

Allu Arjun and Vijay Devarakonda: ఐకాన్ స్టార్ అండ్ రౌడీ హీరో… ఇద్దరికీ అదొక్కటే మ్యూచ్యువల్ టార్గెట్!!

Ramya Krishnan: చిన్నాపెద్దా అన్ని సినిమాలకు కమర్షియల్ ఎలిమెంట్‌గా ఎవర్‌ గ్రీన్ క్వీన్