Peddanna Movie: ఈ దీపావ‌ళికి క్లాస్, మాస్ అంతా కలిసి చూసే సినిమాను తీసుకువస్తున్నాం : నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది.

Peddanna Movie: ఈ దీపావ‌ళికి క్లాస్, మాస్ అంతా కలిసి చూసే సినిమాను తీసుకువస్తున్నాం : నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు
Suresh Babu
Follow us

|

Updated on: Nov 01, 2021 | 7:34 AM

Peddanna Movie: : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ, సురేష్ బాబు, దిల్ రాజు కలిసి ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ.. ‘మా మీద నమ్మకం ఉంచి పెద్దన్న చిత్రాన్ని విడుదల చేసేందుకు మాకు అవకాశం ఇచ్చిన సన్ టీవీ వారికి, రజినీకాంత్‌కు ధన్యవాదాలు. సినిమా సూపర్ హిట్ అవుతుంది. రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

అలాగే సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘పెద్దన్న సినిమా అన్నాత్తెకు డబ్బింగ్‌గా రాబోతోంది. మేం ఈ సినిమాను ఎందుకు తీసుకున్నామా ? అని అందరికీ అనుమానం రావొచ్చు. కరోనా తరువాత ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లోకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ పెద్ద సినిమాను తీసుకొస్తే ఇంకా బాగుంటుందని అనుకున్నాం అని సురేష్ బాబు అన్నారు. ఈ చిత్రంలో మనకు వింటేజ్ రజినీకాంత్ గారు కనిపిస్తున్నారు. మనం ఎలా అయితే రజినీకాంత్‌ను చూడాలని అనుంటామో అలానే దర్శకుడు శివ చూపించారు. ఇందులో ఎమోషన్ కూడా ఉంది. అన్నాచెల్లెళ్ల బంధం అద్భుతంగా ఉంది. జగపతి బాబు, కుష్బూ, మీనా, నయనతార ఇలా అందరూ చక్కగా నటించారు. ఫుల్ మీల్స్ లాంటి సినిమా. క్లాస్ మాస్ ఫ్యామిలీ అందరూ చూడగలిగే సినిమా. అందరూ థియేటర్‌కు వచ్చి చూసే సినిమా. ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని, చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఇకపై కూడా మేం కలిసే సినిమాలు చేస్తాం. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా మాకు నచ్చిన చిత్రాలను కలిసే విడుదల చేస్తాం. ఈ సినిమా కథను శివ నాకు చెప్పాడు. ఇలాంటి సమయంలో కమర్షియల్ చిత్రమైతే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం సులభం అవుతుంది. కరోనా పట్ల ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. కానీ మన డైలీ రొటీన్ జీవితాన్ని మాత్రం ఆపకూడదు. దీపావళికి పెద్దన్న సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నామ’అని సురేష్ బాబు అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mehreen Pirzada: ఆ ఇద్దరు హీరోయిన్స్‌లా సినిమాలు చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన మెహ్రీన్..

Bommarillu Bhaskar‌: మరో మెగా పవర్ ఆఫర్ కొట్టేసిని బొమ్మరిల్లు భాస్కర్‌.. ఇది నిజమేనా అంటున్న అభిమానులు.. (వీడియో)

Anubhavinchu Raja: ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి హాయిగా నవ్వుకునే సినిమా మాది: రాజ్ తరుణ్

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..