AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

santosh srinivas : బాలయ్య కోసం కథ రెడీగా ఉందట.. ‘బలరామయ్య బరిలోకి దిగితే’ అంటున్న సంతోష్ శ్రీనివాస్

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరో 'కందిరీగ' సినిమాతో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'అల్లుడు అదుర్స్'

santosh srinivas : బాలయ్య కోసం కథ రెడీగా ఉందట.. 'బలరామయ్య బరిలోకి దిగితే' అంటున్న సంతోష్ శ్రీనివాస్
Rajeev Rayala
|

Updated on: Jan 06, 2021 | 11:33 AM

Share

santosh srinivas : ఎనర్జిటిక్ హీరో రామ్ హీరో ‘కందిరీగ’ సినిమాతో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే సంతోష్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ దానిపైన క్లారిటీ మాత్రం రాలేదు. ఆ తర్వాత మాస్ రాజా రవితేజ తో సినిమా చేస్తున్నాడంటూ కూడా వార్తలు షికారు చేసాయి. ఇక ‘అల్లుడు అదుర్స్’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవర్ స్టార్ సినిమా పైన ఆసక్తికర కామెంట్స్ చేసాడు.. పవన్ తో తమిళ ‘తేరి’ సినిమాను రీమేక్ చేయాలనుకున్నా.. ఇందుకోసం రెండు, మూడు సార్లు స్టోరీ సిట్టింగ్స్ కూడా జరిగాయి. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత చేద్దాం అనుకున్నాం.. కానీ పవన్ రాజకీయాల్లోకి వెళ్లారు దాంతో ఈ సినిమా ఆగిపోయింది. కానీ ఎప్పటికైనా పవన్ తో సినిమాను తెరకెక్కిస్తా అని అన్నారు. అలాగే రవితేజ కోసం కూడా కథ రెడీ చేశాను. అది సెట్స్ పైకి వెళ్ళలేదు. కథ ఇప్పటికి అలానే ఉంది. అన్నారు. ఇక బాలకృష్ణ తో సినిమా చేయాలను చూస్తున్నానని అన్నారు. ఇక టైటిల్ గా ‘బలరామయ్య బరిలోకి దిగితే’ అనే టైటిల్ ను కూడా అనుకున్నాను. స్టోరీ లైన్ ను మరియు టైటిల్ ను బాలకృష్ణ గారి వద్దకు తీసుకు వెళ్లాను. ఆయన దాదాపుగా ఓకే చెప్పారు అని తెలిపాడు  సంతోష్ శ్రీనివాస్.

మరిన్ని ఇక్కడ చదవండి:

Red Movie New Song: యూత్‌ని ఆకట్టుకుంటోన్న ‘నువ్వే.. నువ్వే’ వీడియో సాంగ్‌… బాగా వర్కవుట్‌ అయిన కెమిస్ట్రీ..

Raveena Tandon: కేజీఎఫ్‌ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రవీనా టాండన్‌.. సినిమా చూడకుండానే..