AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Movie New Song: యూత్‌ని ఆకట్టుకుంటోన్న ‘నువ్వే.. నువ్వే’ వీడియో సాంగ్‌… బాగా వర్కవుట్‌ అయిన కెమిస్ట్రీ..

Nuvve Nuvve Song Out From Red: ఈస్మార్ట్‌ శంకర్‌తో గతేడాది అదిరిపోయే హిట్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్‌ హీరో రామ్‌. ఇక ఈ సినిమా తర్వాత..

Red Movie New Song: యూత్‌ని ఆకట్టుకుంటోన్న 'నువ్వే.. నువ్వే' వీడియో సాంగ్‌... బాగా వర్కవుట్‌ అయిన కెమిస్ట్రీ..
Narender Vaitla
| Edited By: |

Updated on: Jan 06, 2021 | 11:19 AM

Share

Nuvve Nuvve Song Out From Red: ఈస్మార్ట్‌ శంకర్‌తో గతేడాది అదిరిపోయే హిట్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్‌ హీరో రామ్‌. ఇక ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న రామ్‌ తాజాగా ‘రెడ్‌’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తిరుమల కిశోర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు చిత్రంపై అంచనాలను పెంచేశాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ సినిమాలోని ‘నువ్వే నువ్వే’ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. నిజానికి ఇంతకు ముందే ఈ పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ పాట.. వీడియో ఇప్పుడు హల్చల్‌ చేస్తోంది. ముఖ్యంగా హీరోయిన్‌ అమృతా అయ్యర్‌, రామ్‌ల మధ్య కెమస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఫారిన్‌ లోకేషన్స్‌లో తెరకెక్కించిన ఈ పాట చాలా రిచ్‌గా కనిపిస్తోంది. రామ్‌ స్టెప్పులు పాటకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై స్రవంతి రవికిశోర్‌ నిర్మించిన ఈ సినిమాలో రామ్‌ సరసన నివేద పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ‘తడమ్‌’ అనే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై దర్శకుడు తిరుమల కిశోర్‌ స్పందిస్తూ.. ‘రెడ్‌’ చిత్రమ్‌ తడమ్‌కు రీమేక్‌ కాదని, కేవలం స్టోరీలైన్‌ ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తున్నామని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Also Read: Regina Cassandra : శూర్పణఖగా మారి ప్రేక్షకులను భయపెట్టనున్న అందాల భామ రెజీనా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు

Follow Us
రోజూ చెంచా నెయ్యిని ఇలా తిన్నారంటే.. మీ బాడీలో ఊహించని మార్పులు!
రోజూ చెంచా నెయ్యిని ఇలా తిన్నారంటే.. మీ బాడీలో ఊహించని మార్పులు!
పార్లర్‌కు వెళ్లే పని లేదు.. ఇంట్లోనే ఈజీగాహెయిర్‌ స్పా చేసుకోండి
పార్లర్‌కు వెళ్లే పని లేదు.. ఇంట్లోనే ఈజీగాహెయిర్‌ స్పా చేసుకోండి
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు