Trending Song: అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన సాంగ్.. 30 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ యూట్యూబ్ షేక్ చేస్తున్న పాట..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ సినిమాలే కాదు పాటలు సైతం ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి. దశాబ్దాలు గడిచినప్పటికీ ఆ పాటలకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అటు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందకుంటూ దుమ్మురేపుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్ మాత్రం అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఈ పాటలో ఏదో వైబ్ ఉంటుంది.

టాలీవుడ్ తెరపై ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చినప్పటికీ, కొన్ని పాటలు మాత్రం కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంటాయి. అప్పట్లో సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసి, కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అలాంటి క్లాసిక్ సాంగ్స్ జాబితాలో ‘ప్రేమికుడు’ చిత్రంలోని పాటలు ఎప్పుడూ ముందుంటాయి. దశాబ్దాలు గడుస్తున్నా ఆ పాటలకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆ చిత్రంలోని ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ మరోసారి తెగ వైరల్ అవుతూ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో, ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీత సారధ్యంలో వచ్చిన ‘ప్రేమికుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని ప్రతీ పాట ఒక సెన్సేషనే. ముఖ్యంగా ఇందులో వచ్చే ‘ఎర్రాని కుర్రదాన్ని గోపాల’ సాంగ్ అప్పట్లో యూూత్ ను ఊపేసింది. ప్రభుదేవా గ్రేస్ ఫుల్ డెన్స్ మూవ్స్, గ్లామరస్ నటి నగ్మా అభినయం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఏఆర్ రెహమాన్ అందించిన వెస్ట్రన్ అండ్ ఫోక్ బీట్స్ శ్రోతలను ఇట్టే కట్టిపడేస్తాయి.
ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..
కాలం ఎంత మారినా, ఎన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నా రెహమాన్ మార్క్ మ్యూజిక్ , ప్రభుదేవా డ్యాన్స్ మ్యాజిక్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ , యూట్యూబ్‌లో ఈ వీడియో సాంగ్‌కు వస్తున్న వ్యూస్, లైక్స్ చూస్తుంటే ఈ క్లాసిక్ సాంగ్ క్రేజ్ ఎప్పటికీ తరగనిదని అర్థమవుతుంది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సినీ ప్రియులు ఈ పాటను మళ్లీ మళ్లీ చూస్తూ నెట్టింట షేర్ చేస్తున్నారు. నేటి తరానికి సైతం కిక్కునిచ్చే ఈ ఎవర్ గ్రీన్ డ్యాన్స్ నంబర్, టాలీవుడ్ మ్యూజికల్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అరుదైన మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎక్కువమంది చదివినవి: Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?
ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించగా, వడివేలు తనదైన కామెడీతో అలరించారు. గవర్నర్ కూతురు ప్రేమలో పడిన ఒక సామాన్య యువకుడి కథను, రాజకీయ కుట్రల నేపథ్యంలో అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు దర్శకుడు శంకర్. అందుకే ఈ సినిమా ఇప్పటికీ అడియన్స్ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు.
ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
ఎర్రాని కుర్రదాన్ని గోపాల..
ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..
