Sandeep Reddy Vanga: కొత్త కారు కొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ధర ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది
సందీప్ రెడ్డి వంగా.. ఈ మధ్యన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ బాగా వినిపిస్తోన్న పేరు. స్పిరిట్ సినిమా నుంచి ది మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్ దీపికా పదుకొణెను తప్పించడంతో ఈ సెన్సేషనల్ డైరెక్టర్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.

‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. కేవలం తన డైరెక్షన్ తోనే కాదు తన ఆటిట్యూడ్, లైఫ్ స్టైల్ తోనూ వార్తల్లో నిలుస్తున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సందీప్ రెడ్డి. ఇందులో మొదట దీపికా పదుకొణె హీరోయిన్ అని ప్రచారం జరిగినా, చివరకు యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రికి ఆ అవకాశం దక్కింది. తాజాగా ఈ సెన్సేషనల్ డైరెక్టర్ గ్యారేజీలోకి కొత్త కారు చేరింది. అది కూడా యూరప్ స్పెషల్ బ్రాండ్ అయిన మినీ కూపర్ కారు కావడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తన కొత్త కారుకు సందీప్ రెడ్డి పూజలు చేస్తోన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. స్టైలిష్ లుక్స్ ఉన్న గ్రీన్ షేడ్ కూపర్ మోడల్ కార్ ను ఈ డైరెక్టర్ ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా కార్ ముందు భాగంలో పూలతో అలంకరించడం, హారతి కార్యక్రమంలో సందీప్ తో పాటు అతని సతీమణి పాల్గొనడం స్పష్టంగా ఫోటోల్లో కనిపిస్తోంది. ఇక కొత్త కారు నెంబర్ ప్లేట్ TG09 TR 7395 గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో మినీ కూపర్ మోడల్స్ ధరలు రూ.42.7 లక్షల నుంచి రూ.55.9 లక్షల మధ్య ఉన్నాయి. ఇక డైరెక్టర్ వంగా కార్ స్టైల్ చూస్తే దీని ధర దాదాపుగా రూ.50 లక్షలకు పైగానే ఉండే అవకాశం ఉంది. మొత్తానికి సందీప్ రెడ్డి లాగే అతని కారు కూడా చాలా స్టైలిష్ గా ఉందంటూ సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కొత్త కారుతో సందీప్ రెడ్డి వంగా..
Director #SandeepReddyVanga Bought New car MiniCooper pic.twitter.com/fdvjNoPtPV
— Filmy Bowl (@FilmyBowl) June 19, 2025
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్పిరిట్ సినిమాలో బిజీగా ఉంటున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
కుబేర టీమ్ కు బెస్ట్ విషెస్..
#Kuberaa Wishing the entire team all the very best for the release tomorrow…🤝 Everything that has come out so far is very intriguing and promising. I have a SUPERHIT film feeling…. 😊@AsianSuniel @iamnagarjuna @dhanushkraja@iamRashmika @jimSarbh @sekharkammula… pic.twitter.com/T9M4Q5furV
— Sandeep Reddy Vanga (@imvangasandeep) June 19, 2025




