మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్‌కు సోషల్ మీడియానే పర్ఫెక్ట్ మాధ్యమం అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే... పలు అంశాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతున్నారు. ఒక్కోసారి దీనికి కొన్ని రియాక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రియాక్షన్ అండ్ కామెంట్స్‌లో ఇప్పుడు వేణుస్వామి పేరు వినిపిస్తోంది.
ఆయనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక.. ఇన్నాళ్లూ జాతకాలు.. రాశులు అంటూ సెలబ్రిటీల చుట్టూ తిరిగిన వేణుస్వామి.. ఆ మధ్య అక్కినేని అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ధాటికి కాస్త తగ్గారు. ఇక సెలబ్రిటీల జాతకాలు చూడనని ప్రకటించేశారు కూడా. కానీ, ఎప్పటిలాగే, మాటతప్ప.. మళ్లీ సెలబ్రిటీల జాతకాలు చూస్తూ వీడియోలు చేయడం మొదలెట్టేశాడు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ విమాన ప్రయాణాల గురించి మాట్లాడుతూ… ఇక భూమ్మీద వరుస ప్రమాదాలు జరుగుతాయని.. అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని తన వీడియోలో హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో విమాన ప్రమాదాలు, సునామీ హెచ్చరికలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వరుసగా జరగబోతున్నాయంటూ జోస్యం చెప్పారు. ఈ టైంలో సింహరాశిలో కుజుడు, కేతువు కలిసి ఉండడం వల్ల వివిధ రాశుల వారికి భారీగా నష్టాలు, సమస్యలు ఎదురవుతాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో బాటు 2025 సెప్టెంబర్ 1 వరకు కొన్ని తీవ్రమైన సమస్యలు వచ్చి తీరతాయని చెప్పుకొచ్చాడు. అయితే వేణు స్వామి చేసిన ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా.. పిచ్చి వాగుడు చాలించి.. నోరు అదుపులో పెట్టుకో.. అంటూ వారు గట్టిగా వార్నింగ్ ఇస్తూ తమదైన స్టయిల్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ప్రజలను భయపెట్టి ఏం సాధిస్తావ్? అంటూ నిలదీస్తూ పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా..
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
