దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని చేనేత నగరం పిల్ఖువాకు చెందిన సుభాష్ అనే దినసరి కూలీకి ఐటీ శాఖ నుంచి ఓ నోటీసు అందింది. రూ.7 కోట్ల రూపాయల లావాదేవీల్లో తన ప్రమేయం ఉందంటూ ఐటీ శాఖ తనకు నోటీసు పంపిందని సుభాష్ పోలీసులను ఆశ్రయించటం, ఈ సంగతి ఊరూ వాడా తెలియటంతో ఇప్పుడు ఇది సంచలనంగా మారింది.
పట్టణంలోని మొహల్లా రాణాపట్టి మహాదేవ్ ప్రాంతంలో ఉంటూ దినసరి కూలీ పనులు చేసుకునే తనకు అంత ఆదాయమే లేదని, నిజానికి నిరుడు ఫిబ్రవరిలోనే తనకు ఇలాంటి నోటీసునునే ఐటీ శాఖ పంపిందని, అదేదో పొరబాటున వచ్చిందని భావించిన తాను దానిని పట్టించుకోలేదని, కానీ..15 రోజుల నాడు మళ్లీ అదే నోటీసును పంపటంతో ఇది తనకే వచ్చిందని నిర్థారణ అయిందని సుభాష్ చెప్పుకొచ్చాడు. ఈ నోటీసు వచ్చాక తనకు నిద్రపట్టటంలేదని,ఎన్నో ఏళ్లుగా కూలీ నాలీ చేసుకునే బతుకుతున్న తనకు అంత ఆదాయం ఎలా వస్తుందని వాపోతున్నాడు. అదే సమయంలో సుభాష్ దీనిపై పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలోని ఓ 40 గజాల ఇంట్లో సుభాష్ నివసిస్తున్నట్లు వారు నిర్ధారించారు. 2020-21 సంవత్సరంలో, దోహ్రానాలోని ఒక ఆసుపత్రి నుండి జరిగిన రెండు పెద్ద లావాదేవీల గురించి ఐటీ శాఖకు సమాచారం అందిందని, ఆ లావాదేవీలో సుభాష్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుభాష్ పేరుతో GSTR-1, GSTR-3B లలో లావాదేవీలు జరిగాయని, వాటి విలువ రూ.3,27,40,680, రూ.3,75,74,0850లుగా ఉందని పోలీసులు నిర్ధారించారు. వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ప్రస్తావిస్తూ ప్రస్తుతం ఐటీ శాఖ సుభాష్‌కు నోటీసులు పంపిందని వారు నిగ్గు తేల్చారు. కానీ సుభాష్‌కు ఇవేవీ తెలియకపోవటంతో ఆ నోటీసును పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. కాగా.. ఎవరో తన పేరు వాడుకుని తమ పని చక్కబెట్టుకుంటే..తనకు నోటీసులు పంపటం ఏం న్యాయమని సుభాష్ వాపోయాడు. ఇకనైనా, పోలీసులు విచారణ జరిపి అసలు మోసగాళ్లను చట్టానికి అప్పగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా..
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
