నా భార్య ఎవరితో పోయినా పర్లేదు.. నన్ను చంపకుంటే చాలు
వివాహేతర సంబంధాల వల్లనో లేక ప్రేమ పేరుతోనో కట్టుకున్న భర్త లేదా భార్యను అడ్డు తొలగించుకునేందుకు ఇటీవలి కాలంలో పలువురు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. వీరిలో కొందరు ఏకంగా తమ భాగస్వాములు ప్రాణాలనే బలితీసుకుంటున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య అదృశ్యమైందని, ఆమె తనకు హాని తలపెట్టే ప్రమాదం ఉందని, తనకు రక్షణ కల్పించాలంటూ ముందస్తుగా పోలీసులను ఆశ్రయించటం ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది.
మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని ప్రతాప్ నగర్‌కు చెందిన పర్షు ఠాకూర్, రజనీ బాయి ఠాకూర్ దంపతులు. వీరికి 12, 9 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. కాగా, గత నెలలో రజనీ ఇంటినుంచి వెళ్లిపోయింది. పోతూ పోతూ తన నగలను, కొంత నగదును చేతబట్టుకుని పోయింది. ఆమె ఇల్లు విడిచి పోయి నెల రోజులైనా తిరిగి రాకపోవటంతో పర్షు పోలీసులను ఆశ్రయించాడు. తనకు, తన పిల్లల ప్రాణాలకు తన భార్య నుంచి హాని ఉందని పోలీసుల వద్ద వాపోయాడు. ఒకవేళ.. తన భార్య తనకు నచ్చిన వ్యక్తితో జీవితం గడపటానికి సిద్ధపడితే, తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆమె వైపు నుంచి తనకు, తన పిల్లలకు హాని లేకుండా ఉంటే అదే చాలని చెప్పుకొచ్చాడు. అదే ఆమె అభిప్రాయమైతే.. అదే మాటను..ఒక్కసారి ఆమె తన ముందుకు వచ్చి స్పష్టంగా చెబితే చాలని పోలీసులకు వివరించాడు. ఇటీవల ఓ నవ వధువు తన ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన ఘటనను పోలీసుల వద్ద ప్రస్తావించిన పర్షు.. తనకూ ఆ గతి పడుతుందేమోనని తనకు ఆందోళనగా ఉందని వాపోవటంతో.. పోలీసులు షాక్ అయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
