అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
తుడరుమ్! మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ డూపర్ హిట్టైంది. జస్ట్ 28 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ... మల్లూ బాక్సాఫీస్ దగ్గర రూ. 235 కోట్లకు పైగా వసూలు చేసింది. మోహన్ లాల్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్ హిట్ గా హిస్టరీకెక్కింది. ఇటు ఓటీటీలోనూ ఈ మూవీ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. అలాంటి ఈ మూవీపై ఇప్పుడు కాపీ రైట్ ఆరోపణలు రావడం ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారింది.!
ఇక అసలు విషయం ఏంటంటే..! డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్.. 2020లో తీయట్టమ్ అనే సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా రిలీజైన తుడరుమ్ సినిమా చూసి అందులోని కంటెంట్ చూసి అవాక్కయ్యాడు. ఇది అచ్చుగుద్దినట్లుగా తాను ప్రారంభించిన తీయట్టమ్ సినిమానే పోలి ఉందంటూ తుడరుమ్ సినిమా మేకర్స్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన తీయట్టమ్ సినిమా స్క్రీన్ ప్లే ను.. ఆ స్ట్రక్చర్‌ను కాపీ చేసే.. తుడరుమ్ సినిమాను మలిచారని ఆరోపించారు డైరెక్టర్ సనల్. తన సినిమాను ఎంతగా కాపీ కొట్టారంటే.. తన సినిమాలోని ‘కొన్నాళ్ పాపం తిన్నాళ్ తీరం’ అనే డైలాగ్‌ను ఈ సినిమాలో సేమ్ టు సేమ్ మోహన్ లాల్‌తో చెప్పించారని ఆరోపించారు. అయితే.. తన సినిమా డైలాగ్‌కు, తుడరుమ్ సినిమా స్టోరీకి ఎక్కడా పొంతన లేదని ఎద్దేవా చేశారు. కాపీ కొట్టడంలోనూ తుడరుమ్ డైరెక్టర్ తరుణ్ మూర్తి.. పప్పులో కాలేశాడన్నట్లు సెటైర్ వేశారు సనల్ కుమార్ శశిధర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

