ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
కొన్ని మారుమూల ప్రాంతాల్లో మూఢనమ్మకాలతో కొందరు క్షుద్రపూజలు చేయటం గురించి మీరు వినే ఉంటారు. కానీ, ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా, గుంతకల్లులోని బాగా రద్దీగా ఉండే కాలనీలోని ఓ ఇంటి ముందు వేసిన ఓ వింత ముగ్గును చూసి ఆ దారిన వెళ్లే వారంతా భయంతో వణికి పోయారు.
అది ఖచ్చితంగా క్షుద్రపూజల తాలూకూ ముగ్గేనని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్లులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శనివారం అర్ధరాత్రి పట్టణంలోని రామచంద్రప్ప అనే వ్యక్తి ఇంటి ముందు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. వింత ముగ్గు వేసి.. అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయల వంటివి పెట్టి పూజలు చేశారు. ఆ దారి వెంట వెళ్లిన వారు వాటిని చూసి భయపడి.. ఇంటి యజమానిని అలెర్ట్ చేశారు. కాగా, తాను కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాపై పోరాటం చేస్తున్నందుకే తన ఇంటి ముందు క్షుద్రపూజలు చేశారని, భూ కబ్జాలపై పోరాటం చేస్తున్న తనను ఇప్పటికే కొందరు బెదిరిస్తున్నారని, వారే ఇలాంటి పనిచేసి ఉండొచ్చని రామచంద్రప్ప అనుమానం వ్యక్తం చేశారు. తాను ఇలాంటి వాటికి భయపడనని.. క్షుద్ర పూజల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని రామచంద్రప్ప పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

