Ram Gopal Varma: అలాంటి వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్.. నాకు అర్థం కావడం లేదు.. ఆర్జీవీ ట్వీట్.. 

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదోక విషయంపై తనదైన స్టైల్లో స్పందిస్తుంటారు. అయితే తాజాగా ఆయన తన ట్వీట్టర్ ఖాతాలో సుధీర్ఘ పోస్ట్ చేశారు. తన గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma: అలాంటి వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్.. నాకు అర్థం కావడం లేదు.. ఆర్జీవీ ట్వీట్.. 
Ram Gopal Varma
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Rajitha Chanti

Updated on: Nov 28, 2024 | 9:34 PM

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కొన్ని రోజుల క్రితం ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఆర్జీవీ గురించి నిత్యం ఏదోక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆర్జీవీ కేసులకు భయపడి పరారీలో ఉన్నాడంటూ ఇటీవల కొన్ని వార్తలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. తాజాగా అలాంటి రూమర్స్ కు క్లారిటీ ఇస్తూ సుధీర్ఘ ట్వీట్ చేశారు ఆర్జీవి. తనపై కేసులు.. వాటి సెక్షన్ల వివరాలను వెల్లడిస్తూ వివరణ ఇచ్చారు. తాను చేసిన పోస్టులు.. వాటివల్ల ఎవరి మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి ? అంటూ ప్రశ్నిస్తూనే వివరణ ఇచ్చారు ఆర్జీవీ. తాను పరారీలో ఉన్నాడని మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అంటూ మొత్తం పది పాయింట్లతో సుధీర్ఘ ట్వీట్ చేశారు.

“1. నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ .. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసు లోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప.

2. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసు లోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసు లోకి ఎందుకు రారు?

3. నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్ గా అసలు సంబంధం లేని వ్యక్తులా మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇచ్చారంట.

4. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే 4 వేర్వేరు వ్యక్తులు , ఆంధ్ర ప్రదేశ్ లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదు అయ్యాయి, అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు, ఇవన్నీ కూడా కేవలం గత 4 , 5 రోజుల్లోనే నమోదు అయ్యాయి.

5. నాకు నోటీసు అందిన వెంటనే , నా సినిమా పనుల వల్ల, సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది . కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం , లేకపోతే విడియో ద్వారా హాజరు అవుతాను అని తెలియజేయడం జరిగింది. .. అదే టైమ్ లొ నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు ,నా వాళ్ళకి అనుమానం కలిగింది.

6. నేను సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటాను, చాలా సార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని, ఒక సంవత్సర కాలంలో కొన్ని వేళ పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రం కు సంబంధించినవి, ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా నెలల క్రితం జరిగిపోయింది.

7. నేను పెట్టాను అంటున్న పోస్టులు , వేటి వల్ల ఐతే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాలలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది.

8. ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి.

9. BNS 336(4) ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్డు ను కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం.

నేను చేసిన పోస్టుల చూస్తే , అందులో ఫోర్జరీ ఎక్కడుంది? , అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి. ?

10.BNS 353(2) తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం.

నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు” అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవి.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
2 రోజుల్లో రూ.449 కోట్లు! అరాచకంగా పుష్ప2 వసూళ్లు | రంగమ్మత్తకు..
2 రోజుల్లో రూ.449 కోట్లు! అరాచకంగా పుష్ప2 వసూళ్లు | రంగమ్మత్తకు..
కాంగ్రెస్‌ ఏడాది పాలనపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్‌ ఏడాది పాలనపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..