AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannadh: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్శకుడు పూరీ.. తన కుటుంబానికి ప్రాణ హానీ ఉందని

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో పూరిజగన్నాథ్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోయారు.

Puri Jagannadh: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో  దర్శకుడు పూరీ.. తన కుటుంబానికి ప్రాణ హానీ ఉందని
Puri Jagannadh
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2022 | 6:15 AM

Share

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం  చేసుకున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు రిజల్ట్ తో సంబంధంలేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే ఆయన రీసెంట్ గా లైగర్ అనే సినిమా చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో పూరిజగన్నాథ్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోయారు. అయితే పూరీకి ఫ్లాప్ లు కొత్తేమి కాదు ఎన్ని ఫ్లాప్ లు వచ్చిన ఎప్పుడో ఒకసారి సాలిడ్ హిట్ కొట్టి ఆకట్టుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పూరీజగనాథ్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. లైగర్ దెబ్బకు నిర్మాతలు బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత పూరీకి మరియు బయ్యర్లకు మధ్య వివాదం నెలకొంది.

రోజు రోజుకు ఈ వివాదం ముదురుతూ వస్తోంది. లైగర్’ సినిమాకు గాను నష్టపరిహారం కోరుతూ.. పూరీ జగన్నాథ్ ఇంటి ముందు ధర్నాకు దిగుతామని ఎగ్జిబిటర్స్ బెదిరింపులు సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తన కుటుంబానికి ప్రాణ హానీ ఉందని డిస్ట్రిబ్యూటర్స్ పై పూరీ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి డిస్ట్రిబ్యూటర్స్ పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పూరీ కేసు నమోదు చేశారు.

డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మరియు ఫైనాన్సియర్ శోభన్ బాబు లు తన కుటుంబంపై దాడి చేయడానికి ఇతరులను హింసకు ప్రేరేపిస్తున్నారని పూరి జగన్నాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను లేనప్పుడు తన కుటుంబాన్ని శారీరకంగా , మానసికంగా వేధించి అక్రమంగా డబ్బు వసూలు చేయాలని చూస్తున్నారని తన ఫిర్యాదులో  తెలిపారు పూరిజగన్నాథ్ . వరంగల్ శ్రీను , శోభన్ బాబులు వాట్సాప్ ద్వారా నాపై సబ్ డిస్ట్రిబ్యూటర్లను రెచ్చగొట్టారని , నా నుండి చట్టవిరుద్ధంగా డబ్బు సేకరించేందుకు బ్లాక్ మెయిలింగ్ ,  వేధింపుల చేస్తున్నారు పోలీసులకు తెలిపారు పూరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!