ఓటీటీ లవర్స్‌కు సూపర్ గుడ్ న్యూస్.. ఒకేసారి డిజిటల్ రిలీజ్ అవుతోన్న కాంతార, పొన్నియిన్ సెల్వన్ 1.. ఎప్పుడంటే
ఇక థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన ఎనిమిది వారల తర్వాత ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది.

ఓటీటీల హంగామా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. కరోనా పుణ్యమా అని ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. సినిమాలు వెబ్ సిరీస్ లతో ఓటీటీలు ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి. ఇక థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన ఎనిమిది వారల తర్వాత ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం రెండు మూడు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అలాగే సూపర్ హిట్ అయినా సినిమాలను భారీ అమౌంట్ ఇచ్చి మరి దక్కించుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు ఈ క్రమంలోనే ఈ మధ్య సూపర్ హిట్స్ గా నిలిచినా రెండు సినిమాలు ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తంలో కొనుగోలు చేసింది. ఆ రెండు సినిమాలను త్వరలోనే ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు.
రెండు బ్లాక్ బస్టర్ సినిమాల స్ట్రీమింగ్ హక్కుల్ని తాజాగా అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. భారీ స్థాయిలో విడుదలై పాన్ ఇండియా సినిమాలుగా సంచలనం సృష్టించిన `పొన్నియిన్ సెల్వన్ 1` కన్నడ సెన్సేషన్ `కాంతార` చిత్రాల స్ట్రీమింగ్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈ రెండు సినిమాలు నవంబర్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయని తెలుస్తోంది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కింది పొన్నియిన్ సెల్వన్. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష ప్రధాన పాత్రలలో నటించిన పొన్నియిన్ సెల్వన్ దేశవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది.
అలాగే కాంతార సినిమా కూడా ఓటీటీలో రానుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. భారీగా కలెక్షన్లు రాబట్టడమే కాదు..! మేకర్స్ అందరి చేత చప్పట్లు కొట్టిస్తుంది. కనుమరుగవుతున్న కన్నడ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల మరోసారి ప్రజలకు గుర్తు చేసే చిత్రం ఇది. ఇలా ఈ రెండు సినిమాలు ఓకే సారి నవంబర్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుండటంతో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








