Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Musings: విరక్తి, వైరాగ్యంపై పూరీ జగన్నాథ్ ఆసక్తికర కామెంట్స్.. పూరీ మ్యూజింగ్స్‏లో ‘ఆధ్యాత్మిక మార్గం’..

ఎవరినో ప్రేమిస్తాం.. వాళ్లు మోసం చేస్తారు. వెక్కి వెక్కి ఏడుస్తాం.. రాత్రి పగలూ తేడా లేకుండా ఏడుస్తాం. మీరు గానీ అలా ఏడుస్తుంటే కంగ్రాట్స్. మీరు క్యూలో ఉన్నారు. రాత్రి పగలూ కునుకు లేకుండా కష్టపడుతున్నారు.

Puri Musings: విరక్తి, వైరాగ్యంపై పూరీ జగన్నాథ్ ఆసక్తికర కామెంట్స్.. పూరీ మ్యూజింగ్స్‏లో 'ఆధ్యాత్మిక మార్గం'..
Puri Jagannadh
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 05, 2023 | 8:47 AM

చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. కొన్నాళ్ల క్రితం కంటిన్యూగా పూరీ మ్యూజింగ్స్‏లో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన పూరీ.. ఇటీవల సైలెంట్ అయ్యారు. దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి నెట్టింట యాక్టివ్ అయ్యారు. తాజాగా పూరీ మ్యూజింగ్స్ యూట్యూ్బ్ ఛానల్లో పూరీ మాట్లాడుతూ.. విరక్తి, వైరాగ్యం, ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాగుబోతులు, తిరుగుబోతులు, ఆశబోతులు, పొగరుబోతులు అందరూ కలిసేది ఒకే ఒక జంక్షన్.. అదే విరక్తి అని అన్నారు పూరి.

“ఎవరినో ప్రేమిస్తాం.. వాళ్లు మోసం చేస్తారు. వెక్కి వెక్కి ఏడుస్తాం.. రాత్రి పగలూ తేడా లేకుండా ఏడుస్తాం. మీరు గానీ అలా ఏడుస్తుంటే కంగ్రాట్స్. మీరు క్యూలో ఉన్నారు. రాత్రి పగలూ కునుకు లేకుండా కష్టపడుతున్నారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి. కుటుంబం పరువు కాపాడాలి. కోట్లు కోట్లు సంపాదించాలి. మీరు ఇలా ఉంటే వెరీ గుడ్. మీరు చేయని అరాచకం లేదు. చేయని మోసం లేదు. ఎలాగైనా పదవి కావాలి. అందుకోసం ఎంతమందిని అయినా నరుకుతా అనుకుంటే మీరు సరైన దారిలో పయనిస్తున్నారని అర్థం. ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నారని అర్థం. ఎంత కామిస్తారో కామించండి. రమిస్తారో రమించండి. ఎంత తాగుతారో తాగండి. మద్యం మీద విరక్తి కలిగేలా తాగండి. మీరు సరైనా దారిలో ఉన్నారు. ప్రేమిస్తూ అలసిపోండి. పనిచేస్తూ నలిగిపోండి. దొంగతనాలు చేస్తూ తిరగండి.. అందరినీ హింసించండి. ప్రజా సేవలో కరిగిపోండి.

వయసు పెరిగే కొద్దీ కొన్ని అర్థమవుతాయి. నరాల బలహీనమైన తర్వాత కూలబడ్డాక అర్థమవుతాయి. చివరికి తాగుబోతులు, తిరుగుబోతులు, ఆశబోతులు, పొగరుబోతులు అందరూ కలిసే జంక్షన్ ఒక్కటే అదే విరక్తి. ఆ తర్వాత వచ్చేది వైరాగ్యం. నాలుగు లాఠీ దెబ్బలు తిన్న వయసులో ఉన్న కుర్రాళ్లకు చెప్పండి మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారని చెప్పండి. ఎందుకు ఇలాంటి పిల్లలను కన్నామని ఓ తండ్రి ఎడుస్తుంటే మీరు ఆధ్యాత్మకి మార్గంలో ఉన్నారని చెప్పండి. మనమందరం ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేందుకు పుట్టాం. కొంచం త్వరగా వెళితే మంచిది. అడుగులు వేద్దాం పదండి” అంటూ చెప్పుకొచ్చారు పూరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.