AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sir Movie: విద్యార్థుల కోసం మేకర్స్ కీలక నిర్ణయం.. ‘సార్’ సినిమా ఫ్రీ స్క్రీనింగ్ .. ఒక్క మెయిల్ చేస్తే చాలు..

విద్యా హక్కును చాటి చెప్పే ఈ సినిమాను స్కూల్ పిల్లలకు ఉచితంగా ప్రదర్శించాలని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాత సూర్య దేవర నాగవంశీ శనివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Sir Movie: విద్యార్థుల కోసం మేకర్స్ కీలక నిర్ణయం.. 'సార్' సినిమా ఫ్రీ స్క్రీనింగ్ .. ఒక్క మెయిల్ చేస్తే చాలు..
Sir Movie
Rajitha Chanti
|

Updated on: Mar 05, 2023 | 8:27 AM

Share

తమిళ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారిగా తెలుగులో నటించిన చిత్రం సార్. ఇదే మూవీ తమిళంలో వాతి పేరుతో విడుదలైన సూపర్ హిట్‏గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించింది. చదువు ఎవరి సొత్తూ కాదని.. అది ప్రతి ఒక్కరి హక్కు అని అందరికి తెలియజేసే సినిమాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే విద్యా హక్కును చాటి చెప్పే ఈ సినిమాను స్కూల్ పిల్లలకు ఉచితంగా ప్రదర్శించాలని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాత సూర్య దేవర నాగవంశీ శనివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

“విద్య వల్ల వచ్చే గౌరవాన్ని.. దాని విలువపై అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సార్ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నేపథ్యంలోనే స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకు మా సినిమాను ఉచితంగా చూపించాలనుకుంటున్నాము. మీ స్కూల్ కు సంబంధించిన వివరాలను మా సంస్థకు contact@sitharaents.com ఐడీకి మెయిల్ చేయగలరు. షో వివరాలను మా టీమ్ మీకు త్వరలో తెలియజేస్తుంది.” అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇటీవలే ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ వీక్షించారు. సినిమా బాగుందంటూ చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో సాయి కుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని, హైపర్ ఆది కీలకపాత్రలలో నటించారు.ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్, శికర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!