13 April 2025

జీవితం గురించి గొప్పగా చెప్పిన గురూజీ.. త్రివిక్రమ్ టాప్ డైలాగ్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

'నిజం చెప్పకపోవడం అబద్ధం.. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.' 'తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు'.

కూతురిని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవటం కాదు.. మోసపోయి కన్నవాళ్ల దగ్గరకి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. 

వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్లు...ఫెయిల్ అయిపోయిన ప్రేమికులందరూ ప్రెండ్స్ కాలేరు. 

యుద్దంలో గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు...ఓడించడం, 'అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించలేరు.. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు'

కారణం లేని కోపం.. ఇష్టం లేని గౌరవం... బాధ్యత లేని యవ్వనం...జ్ఞాపకం లేని వృద్దాప్యం అనవసరం. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు.

అందంగా ఉండటం అంటే మనకు నచ్చినట్టు ఉండడం కానీ ఎదుటివారికి నచ్చేలా ఉండటం కాదు. మనకు వస్తే కష్టం, మనకు కావాల్సిన వాళ్లకు వస్తే నరకం.

వినే టైమ్, చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది, బాధలో ఉన్న వాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం.. బాగున్న వాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం

వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్టగ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు, పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?