AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Raja: ‘గాడ్ ఫాదర్’ సినిమా తర్వాత ఆ ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న మోహన్ రాజా

ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని అటు మెగాస్టార్, ఇటు మోహన్ రాజా గట్టి నమ్మకంతో ఉన్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

Mohan Raja: 'గాడ్ ఫాదర్' సినిమా తర్వాత ఆ ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న మోహన్ రాజా
Mohan Raja
Rajeev Rayala
|

Updated on: Oct 05, 2022 | 7:16 AM

Share

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా నేడు(బుధవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని అటు మెగాస్టార్, ఇటు మోహన్ రాజా గట్టి నమ్మకంతో ఉన్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాలో మార్పులు చేర్పులు చేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో నయన తార మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ గా నయన్ ఈ మూవీలో కనిపించనున్నారు. మోహన్ రాజా తమిళ్ లో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తెరకెక్కించిన తని ఒరువన్ తెలుగులో ధ్రువ పేరుతో రిమేక్ అయిన  విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా తర్వాత మోహన్ రాజా తెలుగులో సినిమాలు చేయనున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట ఈ డైరెక్టర్. అయితే నాగార్జున మాత్రమే కాదు అఖిల్ కూడా ఈ సినిమాలో నటించనున్నాడట. నాగ్ , అఖిల్ తో ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ను ప్లాన్ చేస్తున్నాడట మోహన్ రాజా. గాడ్ ఫాదర్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా పనిలో ఉంటాడని అంటున్నారు.

ఇటీవలే నాగ్ నటించిన ఘోస్ట్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అఖిల్ మాట్లాడుతూ.. నాన్న తో ఓ సినిమా చేస్తున్నా అంటూ హింట్ కూడా ఇచ్చాడు. మరి ఈ తండ్రీకొడుకులను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తాడేమో చూడాలి. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమా చేస్తున్నాడు. అలగే అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. నాగార్జున ఘోస్ట్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!