Ranga Maarthanda teaser: ఆసక్తికరంగా ‘రంగ మార్తాండ’ టీజర్ … నేనొక నటుడిని అంటూ చిరు వాయిస్‏తో..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Mar 18, 2023 | 8:28 PM

ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. నేను ఒక నటుడిని అంటూ చిరంజీవి వాయిస్‏తో ఈ టీజర్ మొదలవ్వగా.. ప్రకాష్ రాజ్‏ను సన్మానిస్తూ వీడియో స్టార్ట్ అయ్యింది.

Ranga Maarthanda teaser: ఆసక్తికరంగా 'రంగ మార్తాండ' టీజర్ ... నేనొక నటుడిని అంటూ చిరు వాయిస్‏తో..
Rangamaarthanda

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం రంగమార్తాండ. చాలా కాలం తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్.వెంకట్ రెడ్డి కలిసి నిర్మించిన ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు మేకర్స్. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. నేను ఒక నటుడిని అంటూ చిరంజీవి వాయిస్‏తో ఈ టీజర్ మొదలవ్వగా.. ప్రకాష్ రాజ్‏ను సన్మానిస్తూ వీడియో స్టార్ట్ అయ్యింది.

“రేయ్.. నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా ” అంటూ బ్రహ్మానందం చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. ‘నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని.. రంగమార్తాండ రాఘవరావుని’ అంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్ తో టీజర్ అదిరిపోయింది.

ఇప్పటికే ఈ సినిమాలో ప్రిమియర్ షో చూసినవాళ్లు డైరెక్టర్ కృష్ణవంశీ పై ప్రశంసలు కురిపించారు. ప్రతి ప్రేక్షకుడిని హృదయాన్ని తాకేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారంటూ విమర్శకులు సైతం పొగిడారు. ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలకపాత్రలు పోషించగా.. ఇళయరాజా సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu