Gunasekhar: ఆమె వల్లనే 50 శాతం వరకూ చిత్రీకరణను పూర్తిచేయగలిగాను.. హీరోయిన్ పై డైరెక్టర్ ప్రశంసలు..
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో గుణశేఖర్ ఒకరు. గుణశేఖర్ సినిమాలు అంటే ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన సినిమాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది భారీ సెట్టింగులు.

ఈ సినిమాను సొంత బ్యానర్‌లోనే నిర్మిస్తున్నాడు గుణశేఖర్. పాన్ ఇండియన్ స్థాయిలో అత్యంత భారీగా సినిమాను నిర్మిస్తున్నాడు గుణశేఖర్. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ .. సమంత అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివి. ఆమె వల్లనే 50 శాతం వరకూ చిత్రీకరణను పూర్తిచేయగలిగాము” అని అన్నారు. అలాగే “ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ సినిమా షూటింగును మొదలుపెట్టిన దగ్గర నుంచి మే 10వ తేదీ వరకూ చిత్రీకరణ జరుగుతూనే వచ్చింది. ఆ తరువాత కరోనా ప్రభావం పెరగడంతో ఆపేశాము. ఇప్పుడు మధ్యాహ్నం వరకూ సమయం ఇచ్చారు కనుక, ఆ సమయంలోను షూటింగు చేస్తూ వెళ్లాలని అనుకుంటున్నాము” అని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :




