Balakrishna : ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ పైన గుర్రుగా ఉన్న బాలయ్య అభిమానులు.. కారణం ఇదే..

నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టిన ఓ రెండు న్యూస్‌లు నందమూరి అభిమానులకు మింగుడు పడడం లేదు.

Balakrishna : ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ పైన గుర్రుగా ఉన్న బాలయ్య అభిమానులు.. కారణం ఇదే..
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 03, 2021 | 6:45 AM

Balakrishna :

నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టిన ఓ రెండు న్యూస్‌లు నందమూరి అభిమానులకు మింగుడు పడడం లేదు. అసలు ఆ ఇద్దరు హీరోయిన్‌లు అలా ఎలా తమ నందమూరి అందగాడికి నో చెప్పారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవేదనే కాదు పట్టరాని ఆక్రోశంతో సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. బాలయ్య బాబు హీరోగా గోపీచంద్ మలినేని ఓ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన త్రిష అంటూ.. రకుల్‌ ప్రీత్ అంటూ .. ఓ న్యూస్‌ రీసెంట్గా నెట్టింట హల్ చల్ చేసింది. దీంతో పాటే వారిద్దరూ బాలయ్యను రిజెక్ట్‌ చేశారంటూ మరో న్యూస్ సోషల్ మీడియాను ముంచెత్తింది. ఇక ఈ న్యూస్‌ని విన్న అభిమానులు ఈ హీరోయిన్లపై సోషల్ మీడియా వేదికగా మండి పడుతున్నారు. అలా ఎలా.. అంత ఈజీగా మా బాలయ్యకు నో చెబుతారంటూ… ప్రశ్నిస్తున్నారు. ప్లాపుల్లో ఉన్నా కూడా లయన్‌ సినిమాలో ఛాన్స్ ఇచ్చి మా బాలయ్య నిన్ను ప్రోత్సహించారు. అది మరిచిపోయి ఇప్పుడు మా బాలయ్యకే నో చెబుతావా త్రిషా అంటూ.. సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.

రకుల్ బాలయ్య పక్కన యాక్ట్‌ చేయనంటూ చెప్పినందుకు థాంక్యూ అంటూ.. రివర్స్‌లో హీరోయిన్‌ రకుల్ను కూడా తెగ ట్రోల్ చేస్తున్నారు నందయూరి అభిమానులు.ఇదిలా ఉంటే బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాలో హీరోయిన్గా శృతి హాసన్‌ ఫిక్సయ్యారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. క్రాక్‌ హిట్‌తో మళ్లీ కంబ్యాక్‌ అయిన శృతి ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్నారు. బాలయ్యతో నటించడానికి ఓకే చెప్పిన శృతి.. ఇప్పటికే ప్రభాస్‌ పక్కన సలార్‌ సినిమాలోనూ నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ram Pothineni : 14 ఏళ్ల వయసులోనే…. ఏ హీరోకు సాధ్యం కాని ఘనతను సాధించిన రామ్.. అదేంటో తెలుసా..

Most Desirable Man And Women In Tv 2020: మోస్ట్ డిజైరబుల్ 2020 టీవీ నటీనటులు ఎవరో తెలుసా..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!