Vijay Deverakonda: కింగ్ డమ్ సినిమా సెట్లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి బర్త్ డే సెలబ్రేషన్స్..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ కింగ్ డమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అంచనాలు పెంచేశాయి. ఇందులో విజయ్ మాస్ హీరోగా కనిపించనున్నాడు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి బర్త్ డే సెలబ్రేషన్స్ ను “కింగ్ డమ్” సినిమా సెట్ లో జరిపారు. హీరో విజయ్ దేవరకొండ, సినిమా టీమ్ మెంబర్స్ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. “కింగ్ డమ్” సినిమా షూటింగ్ లో ప్రతి రోజూ ఎంజాయ్ చేశామని, ఒక గొప్ప కథను ప్రేక్షకులకు చెప్పబోతున్నామని విజయ్ దేవరకొండ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
“కింగ్ డమ్” చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 30న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కింగ్‌డమ్’ చిత్రానికి విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. సినిమాని వేరే స్థాయికి తీసుకొని వెళ్ళడానికి తన వైపు నుంచి నూటికి నూరు శాతం కృషి చేస్తున్నారు. విజయ్ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే, దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టి ఉండటం సహజం.
Boys getting RWDY 🙂
Happy birthday @gowtam19 ❤️
We are shooting our last schedule together and i have enjoyed everyday of making #KINGDOM with you. We will tell a great story this year and more importantly we make memories and a bond for life.
May you have the best of… pic.twitter.com/DfaEbGA8AT
— Vijay Deverakonda (@TheDeverakonda) March 2, 2025
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
