- Telugu News Photo Gallery Cinema photos Mithila Palkar shared latest mesmerizing pictures goes viral in social media
Mithila Palkar: అందం ఈమె హృదయాన బందీ అయింది.. మెస్మరైజ్ మిథిలా..
మిథిలా పాల్కర్ ఒక భారతీయ నటి, ఆమె TV సిరీస్ గర్ల్ ఇన్ ది సిటీ మరియు నెట్‌ఫ్లిక్స్ యొక్క లిటిల్ థింగ్స్‌లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఆమె "కప్ సాంగ్" యొక్క మరాఠీ వెర్షన్‌తో మార్చి 2016లో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆమె ఫిల్మ్‌ఫేర్ అవార్డు మరాఠీ మరియు రెండు ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ అందాల భామ.
Updated on: Mar 02, 2025 | 10:00 PM

11 జనవరి 1993న మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఓ మరాఠి కుటుంబంలో జన్మించింది అందాల తార మిథిలా పాల్కర్. మొదట్లో తన తల్లిదండ్రులు మరియు సోదరితో కలిసి మహారాష్ట్ర రాష్ట్రంలోని వసాయ్‌లో నివసించింది ఈ వయ్యారి భామ.

చదుకోవడం కోసం ప్రయాణం అసౌకర్యాల కారణంగా ఆమె తల్లి తరపు నుంచి తాతలతో కలిసి దాదర్‌లో నివసించడానికి వెళ్ళింది. మహారాష్ట్రలోని దాదర్‌లో IES మోడరన్ ఇంగ్లీష్ స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.

హయ్యర్ సెకండరీలో సైన్స్ అభ్యసించినప్పటికీ బాంద్రాలోని MMK కాలేజీలో బ్యాచిలర్స్ ఆఫ్ మాస్ మీడియా (BMM)ని ఎంచుకుంది. 2013లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత క్వాసర్ థియేటర్ ప్రొడక్షన్స్ కి చెందిన క్వాసర్ పదమ్‌సీకి తన మొదటి ఆడిషన్ ఇచ్చింది.

2014లో మజా హనీమూన్ అనే మరాఠి షార్ట్ ఫిల్మ్ లో నటించింది. 2015లో హిందీ చిత్రం కట్టి బట్టితో తొలిసారి వెండితెరపై కనిపించింది. 2022లో విశ్వక్ సేన్ సరసన ఓరి దేవుడా అనే తెలుగు చిత్రంలో కథానాయకిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ అందాల భామ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్లు తెగ వైరల్ చేస్తున్నారు.




